కథల ప్రాంగణంలో ఒక సుస్థిరమైన ప్రాకారాన్ని సాధించుకున్న కథా రచయిత విహారి. పది కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు, నాలుగు విమర్శనా గ్రంథాలు, శ్రీ పదచిత్రరామాయణంలో నాలుగు కాండాలు విహారి కలం నుండి వెల్లువెత్తిన అక్షర ప్రవాహాలు. ఇవే కాకుండా ఎప్పటికప్పుడు సీనియర్, వర్ధమాన రచయితల పై, వారి కొత్త రచనల పై విశ్లేషనాత్మక రన్నింగ్ కామెంటరీ సాహిత్యంతో విహారిగారికున్న నిత్యసంబంధాలని, అధ్యయనాన్ని చెబుతుంది. జీవితానుభవాల ఉపరితలాలను దాటి, లోపల అంతర్లీనమై ఉన్న దుఃఖాన్ని పట్టుకోగలగడం విహారి ప్రత్యేకత.
నవ్వుతూ, నవ్విస్తూ, గెంతులేస్తూ బతుకును కొనసాగించే చాలా మందిలో అలజడి కలిగిస్తున్న వెలితిని పట్టుకొన్నవారు విహారి. కాలం తెచ్చే మార్పును అంచనా వేయడం, ఆ అంచనాలోంచి పలచబడుతున్న మానవ సంబంధాలను గురించిన హెచ్చరికను పాసాన్ చెయ్యడం, విహారి కథల కర్తవ్యం. సమాజంలో మార్పుకు సంబంధించిన 'స్పృహ' మొదలయ్యాక 'చిరంజీవి ఆశ' దాకా విహారి కథా సంపుటాలు ఆయా సందర్భాలకు ప్రతిబింబాలవుతాయి. ఇవాల్టి కథ బలహీనపడుతున్న సంబంధాల వెనకాల వున్న ఆర్థికమూలాల గురించి చెబుతోంది.
- సంపాదక వ్యాఖ్య
కథల ప్రాంగణంలో ఒక సుస్థిరమైన ప్రాకారాన్ని సాధించుకున్న కథా రచయిత విహారి. పది కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు, నాలుగు విమర్శనా గ్రంథాలు, శ్రీ పదచిత్రరామాయణంలో నాలుగు కాండాలు విహారి కలం నుండి వెల్లువెత్తిన అక్షర ప్రవాహాలు. ఇవే కాకుండా ఎప్పటికప్పుడు సీనియర్, వర్ధమాన రచయితల పై, వారి కొత్త రచనల పై విశ్లేషనాత్మక రన్నింగ్ కామెంటరీ సాహిత్యంతో విహారిగారికున్న నిత్యసంబంధాలని, అధ్యయనాన్ని చెబుతుంది. జీవితానుభవాల ఉపరితలాలను దాటి, లోపల అంతర్లీనమై ఉన్న దుఃఖాన్ని పట్టుకోగలగడం విహారి ప్రత్యేకత. నవ్వుతూ, నవ్విస్తూ, గెంతులేస్తూ బతుకును కొనసాగించే చాలా మందిలో అలజడి కలిగిస్తున్న వెలితిని పట్టుకొన్నవారు విహారి. కాలం తెచ్చే మార్పును అంచనా వేయడం, ఆ అంచనాలోంచి పలచబడుతున్న మానవ సంబంధాలను గురించిన హెచ్చరికను పాసాన్ చెయ్యడం, విహారి కథల కర్తవ్యం. సమాజంలో మార్పుకు సంబంధించిన 'స్పృహ' మొదలయ్యాక 'చిరంజీవి ఆశ' దాకా విహారి కథా సంపుటాలు ఆయా సందర్భాలకు ప్రతిబింబాలవుతాయి. ఇవాల్టి కథ బలహీనపడుతున్న సంబంధాల వెనకాల వున్న ఆర్థికమూలాల గురించి చెబుతోంది. - సంపాదక వ్యాఖ్య© 2017,www.logili.com All Rights Reserved.