ఈ కథానిక సంపుటిలో మొత్తం ఇరవై నాలుగు కథలున్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. వేగంగా చదివిస్తాయి. ప్రతిభా మనోజ్ఞంగా భాసిస్తున్నాయి. శోభిస్తున్నాయి. ఇంచుమించుగా తెలుగు కథ పుట్టు పూర్వోత్తరాలకు నూట ఇరవై అయిదు సంవత్సరాల చరిత్ర ఉంది. బహుశా ఒక లక్ష కథలదాకా వివిధ పత్రికలలో ఈ 'సవాశతాబ్దం' లో వచ్చి ఉంటాయి. అయితే ఏక కుటుంబం నుంచి ఇటువంటి మంచి కథలు ఓకే సంకలనంగా రాలేదు. ఎవరూ తేలేదు.
ఇప్పటి తెలుగు సాహిత్య ప్రపంచానికి, చలనచిత్ర రంగానికి నిరంతర స్మరనీయుడైన 'బాపు' ఈ కథాసంకలనానికి పేరు పెట్టటం, ముఖ చిత్రాలంకరణ చేయటం అరుదైన విశేషం లేదా విశిష్టత అనాలి. ఈ కథా సంకలనంలో శ్రీమతి యర్రమిల్లి విజయలక్ష్మి కథలు ప్రత్యేకంగా ప్రశంసా పాత్రమైనవి. ఇతివృత్తమూ, సన్నివేశ పరికల్పనం, సంభాషణలు, ఆద్యంతాలు పరిపుష్టంగా తన కథలో నిర్వహించారీమె. ఏ ప్రమాణాలనుబట్టి చూసినా ఇవి మంచి కథలు.
ఈ కథానిక సంపుటిలో మొత్తం ఇరవై నాలుగు కథలున్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. వేగంగా చదివిస్తాయి. ప్రతిభా మనోజ్ఞంగా భాసిస్తున్నాయి. శోభిస్తున్నాయి. ఇంచుమించుగా తెలుగు కథ పుట్టు పూర్వోత్తరాలకు నూట ఇరవై అయిదు సంవత్సరాల చరిత్ర ఉంది. బహుశా ఒక లక్ష కథలదాకా వివిధ పత్రికలలో ఈ 'సవాశతాబ్దం' లో వచ్చి ఉంటాయి. అయితే ఏక కుటుంబం నుంచి ఇటువంటి మంచి కథలు ఓకే సంకలనంగా రాలేదు. ఎవరూ తేలేదు. ఇప్పటి తెలుగు సాహిత్య ప్రపంచానికి, చలనచిత్ర రంగానికి నిరంతర స్మరనీయుడైన 'బాపు' ఈ కథాసంకలనానికి పేరు పెట్టటం, ముఖ చిత్రాలంకరణ చేయటం అరుదైన విశేషం లేదా విశిష్టత అనాలి. ఈ కథా సంకలనంలో శ్రీమతి యర్రమిల్లి విజయలక్ష్మి కథలు ప్రత్యేకంగా ప్రశంసా పాత్రమైనవి. ఇతివృత్తమూ, సన్నివేశ పరికల్పనం, సంభాషణలు, ఆద్యంతాలు పరిపుష్టంగా తన కథలో నిర్వహించారీమె. ఏ ప్రమాణాలనుబట్టి చూసినా ఇవి మంచి కథలు.© 2017,www.logili.com All Rights Reserved.