Title | Price | |
Bhadrachalam Mannem Kathalu | Rs.90 | Out of Stock |
సాహితీ ప్రియులకు...
సాహితీ సుమం లో ఓ రేకై ఒదిగిపోయి, సాదా సీదా భాషలో కూడా ఇమిడిపోతూ, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వ్యాక్యం లోనో, భావన లోనో తమకు తామే తారసపడుతూ.. సరికొత్తగా పరిచయం చేసుకుంటూ... వారి వారి జీవన ప్రయాణాలకు ప్రతిబింబమై....
చివరికి-
సాగరంలో కలిసిపోయే సెలయేటి ప్రవాహంలా....
అనగనగాతో బయలుదేరి... కాశీమజిలీలు సాగిస్తూ... కంచికి చేర్చే 'కథ'- కలకాలం
ప్రియం.
నాటి నుండి నేటికీ కాల్పనిక సాహిత్యమూ, అనుభూతి వాద సాహిత్యమూ వాటి వాటి స్థానాలకై ఒకదానితో మరొకటి పోటీ పడటమే కాకుండా ఆయా కోవకు చెందిన రచయితలుగా రచయితకు గుర్తింపును తెచ్చి పెట్టాయి కూడా. కానీ ఇందులో శ్రీ విద్యాసాగర్ గారు వాస్తవ సంఘటనలు మిగిల్చిన అనుభవాలకు అక్షరరూపం దిద్ది కదా సాహిత్వంలో అనుభవ వాదాన్ని తనదైన పంథాలో సృష్టించారనడానికి పుస్తక సాక్ష్యం కథలు కాని కతలైన - ఈ 'భద్రాచలం మన్నెం కథలు'.
తన అనుభవాల్లోని చేదునీ, అచేతనత్వాన్ని, అశక్తతని నిష్కర్షగా... నిజాయితీగా అక్షరాల్లోకి అనువదించి కతలుగా మనకు అందించిన వైనంతో పాటు... అక్కడి గిరిజన బతుకుల్ని, బతుకుల్లోని వ్యథల్ని ప్రకృతి అందాల పరిచయంతో రంగరించి... కతలుగా జీవ పోయడం వీరి శైలికి సదృశ్యం. మన్నెం అందాలతో.. ప్రకృతి పారవశ్యంలో పడి పరవశిద్దాం- అని మనం అనుకునే లోపే...
పాచిబండ మీద మోపిన పాదంలా... అక్కడి అమాయక జీవుల వ్యథలు, గాథలు...
చెమ్మగిల్లిన కంటి మసక చూపులో సరిపోల్చుకోలేని ఆకృతులై ఉలిక్కి పడేలా చేసి, వాస్తవంలోకి తెచ్చి వదలి పెడ్తాయి...
అందుకే మీరూ... ఓసారి మన్నెంలోకి అడుగిడి చూడండి... కాదన గలరేమో...?!
కా.. దన - లేని
మీ కోసం ...
కుదించుకు పోయిన వ్యవస్థ - వాస్తవాల వెక్కిరింత నుండి కుదుపులకు లోనై, పరిధి విస్తృతమై నిరంతరం మానవీయ కోణంలో సంస్కరణల బాటగా సాగాలనే రచయిత ఆకాంక్షనీ, ప్రయత్నాన్నీ... స... గర్వంగా...
మీ
వత్సల
© 2017,www.logili.com All Rights Reserved.