అహింసావాది, తోడేలు
సియే లియాంగ్
ఛావోజమీ ప్రభువు డేగలతో, వేటకుక్కలతో, ఈటెలు, బాణాలు గల వేటగాళ్ళతో, ఇంకా పరివారంతో అట్టహాసంగా వేటకు బయలుదేరాడు. దారిలో కొంచెం దూరాన బాట కడ్డంగా ఒక తోడేలు నిలబడి ఉండడం జమీందారు చూశాడు. ఆ తోడేలు వెనుక కాళ్ళమీద నిలబడి అరుస్తూఉంది. గురిచూసి కొట్టడానికి మహావీలుగా ఉంది. ఒక్క బాణముతో జమీందారు దాన్ని గాయపరచాడు. అది తప్పుకొని పరుగెత్తడంతో వేటగాళ్ళు వెంటబడ్డారు. వేటగాళ్ళ అరుపులు, కుక్కల మొరుగులతో అడివి ప్రతిధ్వనించింది; దుమారం లేచింది. దాంట్లో కనబడకుండా పారిపోడానికి తోడేలుకు వీలయింది.
అదే సమయానికి టంగుకువా తన గాడిద నెక్కి చంగ్ షన్ కొండల మీదకు పోతున్నాడు. అతని సంచిలో కొన్ని గుడ్డలు కొన్ని పుస్తకాలు మాత్రమున్నాయి. అతనిది మోట్సు మతం. ఆ మతస్థులకు స్వార్ధరహిత జీవితం, పరసేవ ముఖ్యం. రాజులు, జమీందారులు, సామాన్య ప్రజలు, అందరికీ విశ్వప్రేమ నేర్పాలని వారి దీక్ష. వారు తమ జీవితాలు పేదరికానికంకితం చేశారు. ఇతరులకు సాయపడటంలో తమకాపద గల్గినా లెక్కచేయరు.
టంగుకువా ఈ సవ్వడి విన్నాడు. ఇంతలో తోడేలు వేటగాళ్ళ బారినుండి తప్పించుకొని తనవైపే వస్తుంది. అతణ్ని చూచి తనకు సాయంచేయమని దీనంగా అరిచింది. దాని వీపున గుచ్చుకొని ఉన్న బాణం కంటబడగానే అతని మనస్సు కరిగిపోయింది.................
అహింసావాది, తోడేలు సియే లియాంగ్ ఛావోజమీ ప్రభువు డేగలతో, వేటకుక్కలతో, ఈటెలు, బాణాలు గల వేటగాళ్ళతో, ఇంకా పరివారంతో అట్టహాసంగా వేటకు బయలుదేరాడు. దారిలో కొంచెం దూరాన బాట కడ్డంగా ఒక తోడేలు నిలబడి ఉండడం జమీందారు చూశాడు. ఆ తోడేలు వెనుక కాళ్ళమీద నిలబడి అరుస్తూఉంది. గురిచూసి కొట్టడానికి మహావీలుగా ఉంది. ఒక్క బాణముతో జమీందారు దాన్ని గాయపరచాడు. అది తప్పుకొని పరుగెత్తడంతో వేటగాళ్ళు వెంటబడ్డారు. వేటగాళ్ళ అరుపులు, కుక్కల మొరుగులతో అడివి ప్రతిధ్వనించింది; దుమారం లేచింది. దాంట్లో కనబడకుండా పారిపోడానికి తోడేలుకు వీలయింది. అదే సమయానికి టంగుకువా తన గాడిద నెక్కి చంగ్ షన్ కొండల మీదకు పోతున్నాడు. అతని సంచిలో కొన్ని గుడ్డలు కొన్ని పుస్తకాలు మాత్రమున్నాయి. అతనిది మోట్సు మతం. ఆ మతస్థులకు స్వార్ధరహిత జీవితం, పరసేవ ముఖ్యం. రాజులు, జమీందారులు, సామాన్య ప్రజలు, అందరికీ విశ్వప్రేమ నేర్పాలని వారి దీక్ష. వారు తమ జీవితాలు పేదరికానికంకితం చేశారు. ఇతరులకు సాయపడటంలో తమకాపద గల్గినా లెక్కచేయరు. టంగుకువా ఈ సవ్వడి విన్నాడు. ఇంతలో తోడేలు వేటగాళ్ళ బారినుండి తప్పించుకొని తనవైపే వస్తుంది. అతణ్ని చూచి తనకు సాయంచేయమని దీనంగా అరిచింది. దాని వీపున గుచ్చుకొని ఉన్న బాణం కంటబడగానే అతని మనస్సు కరిగిపోయింది.................© 2017,www.logili.com All Rights Reserved.