మా వూరి కధలు గురించి ప్రముఖలు ఈ విధంగా అన్నారు :
మొదటి కధ మోహన్ బొమ్మతో 'రికార్డు బ్రేక్' వచ్చింది. మొదటిరోజే... పత్రిక మార్కెట్టులోకి వచ్చిన గంటకే... 'పొగబండి కధల' ఫేం ఓలేటి శ్రీనివాసభానుగారు ఫోన్ చేసి, 'ఏం కధండీ! 'ఏం మనషులండీ! నన్నేకడికో తీసుకెళ్ళిపోయారు', అంటూ అభినందించారు.
మావూరు షావుకారి పిచ్చయ్యగారబ్బాయి డాక్టర్ సత్యనారాయణ (ఎముకల స్పెషలిస్ట్)తెనాల్నించి ఫోన్ చేసి - 'మన ఊర్ని, మనుషుల్ని, ఆ పాత రోజుల్ని, నా బాల్యాన్ని గుర్తు చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఊరందరికీ తరపున అభినంది స్తున్నాను,' అన్నాడు.
ఒకరోజు విశ్వవిఖ్యాత చిత్రకారులు బాపుగార్నించి వుత్తరం వచ్చింది. 'మీరు రాసిన 'వానాకాలం చదువులు' కధలోలాగే ఒకసారి నాకు జరిగిం,'దని లెటర్ రాశారు. అది చదివినాక నా జీవితం ధన్యమైందనుకున్నాను. ఆ ఉత్తరమే ఈ పుస్తకం అట్ట చివర బాపుగారి దస్తూరితోనే అచ్చేసుకున్నాను.
'బీరం మస్తాన్ రావునండి! 'బుర్రిపాలెం బుల్లోడు' సినిమా డైరెక్టర్ని. మీరు రాసిన ప్ర.సా.దు.లో మాంసం కూర మాసాల వాసన నా దాకా వచ్చిందండీ.' అన్నారు.
ప్రముఖ సినీ దర్శకులు, 'మా పసలపూడి కధలు' ఫేం వంశీగారు ఫోన్ చేసి, 'కంగ్రాట్స్ రాజుగారూ, మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా హిట్టే,' అన్నారు.
సినిమా యాక్టర్ జయప్రకాష్ రెడ్డిగారి నుండీ, 'మా ఊరి కధలు చాలా బాగున్నాయి. కనగాల చెవిటిసాయిబు కధ అద్భుతం... అలాంటిదే నాకొక నాటకం రాసిపెట్టండి,' అన్నారు. ప్రముఖ నాటక రచయిత పూసలగారితో కలిసి మా ఇంటికి వచ్చి అభినం దించారు.
'ఐలవరం పెద్దకరణంగారమ్మాయినండీ! వీరయ్య ఇంకా చెరుకుపల్లిలో ఉన్నా డండీ!' అంది.
'గుడ్డి అచ్చమ్మ ఇంకా బతికే ఉందాండీ,' కనగాల గుప్తా హోటల్లో కాఫీ మేమూ తాగామండీ. ఎంత రుచో... చెవిటిసాయిబు దగ్గర మేమూ బట్టలు కుట్టిచ్చుకున్నామండి...' అంటూ రోజూ ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే వున్నాయి.
ఎండ్లూరి సుధాకర్ గారు ఫోన్ చేసి, 'మనం సంపాదించే లక్షలు, కోట్లు పోతాయి. కానీ మీరు రాసే అక్షరాలు కలకాలం ఉంటాయి. కధలు చాలా బాగున్నాయి. ఆపకండి కంటిన్యూ చేయండి,' అంటూ అభినందించారు.
నరసారావుపేట నుంచి మాణిక్యరావుగారు ఫోన్ చేసి, 'మీ 'సర్కస్ సుబ్బారావు కధలోని గ్రేట్ ఓరియంటల్ సర్కస్ నిడుబ్రోలులో మేమూ చూశాం,' అన్నారు.
మార్కాపురం నుంచి, 'కనబడ్డా గేదేలన్నింటినీ మా పిల్లలు ఎంకటమ్మ అనే పిలుస్తున్నారండీ,' అని ప్రసాద్ గారూ, తుళ్ళిమల్లి విల్సన్ సుధాకర్ గారు ఫోన్ చేసి, 'వూళ్ళో అంతా గుడ్డోళ్ళే కధలో తాటాకుల మీద కాలుస్తున్న నాటుకోడి కమురు వాసన జైపూర్ దాకా వస్తుందండీ,' అన్నారు.
- నక్కా విజయరామరాజు
మా వూరి కధలు గురించి ప్రముఖలు ఈ విధంగా అన్నారు : మొదటి కధ మోహన్ బొమ్మతో 'రికార్డు బ్రేక్' వచ్చింది. మొదటిరోజే... పత్రిక మార్కెట్టులోకి వచ్చిన గంటకే... 'పొగబండి కధల' ఫేం ఓలేటి శ్రీనివాసభానుగారు ఫోన్ చేసి, 'ఏం కధండీ! 'ఏం మనషులండీ! నన్నేకడికో తీసుకెళ్ళిపోయారు', అంటూ అభినందించారు. మావూరు షావుకారి పిచ్చయ్యగారబ్బాయి డాక్టర్ సత్యనారాయణ (ఎముకల స్పెషలిస్ట్)తెనాల్నించి ఫోన్ చేసి - 'మన ఊర్ని, మనుషుల్ని, ఆ పాత రోజుల్ని, నా బాల్యాన్ని గుర్తు చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఊరందరికీ తరపున అభినంది స్తున్నాను,' అన్నాడు. ఒకరోజు విశ్వవిఖ్యాత చిత్రకారులు బాపుగార్నించి వుత్తరం వచ్చింది. 'మీరు రాసిన 'వానాకాలం చదువులు' కధలోలాగే ఒకసారి నాకు జరిగిం,'దని లెటర్ రాశారు. అది చదివినాక నా జీవితం ధన్యమైందనుకున్నాను. ఆ ఉత్తరమే ఈ పుస్తకం అట్ట చివర బాపుగారి దస్తూరితోనే అచ్చేసుకున్నాను. 'బీరం మస్తాన్ రావునండి! 'బుర్రిపాలెం బుల్లోడు' సినిమా డైరెక్టర్ని. మీరు రాసిన ప్ర.సా.దు.లో మాంసం కూర మాసాల వాసన నా దాకా వచ్చిందండీ.' అన్నారు. ప్రముఖ సినీ దర్శకులు, 'మా పసలపూడి కధలు' ఫేం వంశీగారు ఫోన్ చేసి, 'కంగ్రాట్స్ రాజుగారూ, మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా హిట్టే,' అన్నారు. సినిమా యాక్టర్ జయప్రకాష్ రెడ్డిగారి నుండీ, 'మా ఊరి కధలు చాలా బాగున్నాయి. కనగాల చెవిటిసాయిబు కధ అద్భుతం... అలాంటిదే నాకొక నాటకం రాసిపెట్టండి,' అన్నారు. ప్రముఖ నాటక రచయిత పూసలగారితో కలిసి మా ఇంటికి వచ్చి అభినం దించారు. 'ఐలవరం పెద్దకరణంగారమ్మాయినండీ! వీరయ్య ఇంకా చెరుకుపల్లిలో ఉన్నా డండీ!' అంది. 'గుడ్డి అచ్చమ్మ ఇంకా బతికే ఉందాండీ,' కనగాల గుప్తా హోటల్లో కాఫీ మేమూ తాగామండీ. ఎంత రుచో... చెవిటిసాయిబు దగ్గర మేమూ బట్టలు కుట్టిచ్చుకున్నామండి...' అంటూ రోజూ ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే వున్నాయి. ఎండ్లూరి సుధాకర్ గారు ఫోన్ చేసి, 'మనం సంపాదించే లక్షలు, కోట్లు పోతాయి. కానీ మీరు రాసే అక్షరాలు కలకాలం ఉంటాయి. కధలు చాలా బాగున్నాయి. ఆపకండి కంటిన్యూ చేయండి,' అంటూ అభినందించారు. నరసారావుపేట నుంచి మాణిక్యరావుగారు ఫోన్ చేసి, 'మీ 'సర్కస్ సుబ్బారావు కధలోని గ్రేట్ ఓరియంటల్ సర్కస్ నిడుబ్రోలులో మేమూ చూశాం,' అన్నారు. మార్కాపురం నుంచి, 'కనబడ్డా గేదేలన్నింటినీ మా పిల్లలు ఎంకటమ్మ అనే పిలుస్తున్నారండీ,' అని ప్రసాద్ గారూ, తుళ్ళిమల్లి విల్సన్ సుధాకర్ గారు ఫోన్ చేసి, 'వూళ్ళో అంతా గుడ్డోళ్ళే కధలో తాటాకుల మీద కాలుస్తున్న నాటుకోడి కమురు వాసన జైపూర్ దాకా వస్తుందండీ,' అన్నారు. - నక్కా విజయరామరాజు
© 2017,www.logili.com All Rights Reserved.