ఏ మేఘాలూ లేని ఒట్టి నీలిఆకాశం, కళ్ళలో ఏ భావమూ లేని ఓ పసిపాప నిర్మలమైన చూపు, ఊగే గాలికి తలలూపుతూ కాలస్పృహ లేకుండా అలా కంపిస్తూ జీవించే చిగురుటాకులు, ఏ అలలూ లేని ఓ నిద్రించే సరస్సు... ఇవన్నీ ఎంతో సుందరంగా, ఎంతో గంభీరంగా, ఎంతో రమ్యంగా... గాడంగా కూడా ఉంటాయి కదా. కొన్నిసందర్భాల్లో ఏ అలంకారాలూ, నగిషీలూ లేని సరళత కూడా ఓ కొట్టొచ్చిన అందమై భాసిస్తుంది. మనిషి ఎదుటిమనిషిలోని "అమాయకత్వాన్ని" ముచ్చటపడి ప్రేమించేది అందుకే.
అంజనీదేవి కధలు కూడా బోసినవ్వుతో నడిచొచ్చే పసిపిల్లలవలె, పట్టుకుందామంటే చిక్కకుండా పారిపోయే చిరు చేపపిల్లలవలె, దోసిట్లోకి ఒదగని సెలయేటి నీటివలె అందీ అందకుండా జారిపోతాయి. ఈమె కధల్లోని పాత్రలన్నీ మన నిత్యజీవతంలో ప్రతి మనిషికీ ప్రతిదినమూ తారసపడేవే. అడుగడుగునా... ఎక్కడో ఒకదగ్గర మన జీవితగమనంలో ఏదో ఒక పార్శ్వంలో మనకు కనిపించి కనుమరుగయ్యేవే. ఏ మధ్యతరగతి కుటుంబంలోనైనా ఈమె సృష్టించి అక్షరబద్ధం చేసిన పాత్రలన్నీ మనకు సజీవంగా మనమధ్య మనను పలకరిస్తాయి. అంజనీదేవి తనకు తెలిసిన పరిమిత ప్రపంచంలో, తానెరిగిన సాధారణ సామాజిక నేపధ్యాలను, ఏ భేషజాలకూ పోకుండా సహజంగా, సరళంగా కధలుగా మలచి వివిధ సందర్భాలలో పాఠకులకు వివిధ ప్రముఖ పత్రికలద్వారా అందిస్తూ వచ్చారు. వీటినిండా మన సమకాలీన సమాజానికి చందిన "ప్రశాంతంగానే" జీవిస్తున్న ఒక సగటు వర్గానికి చెందిన పాత్రలు దర్శనమిస్తాయి. సంఘర్షిస్తాయి. తపిస్తాయి, దుఃఖిస్తాయి. వేదనపడ్తాయి... మన హృదయాల్లోకి సజీవ స్మృతులుగా ప్రవేశించి జ్ఞాపకాలుగా స్ధిరపడ్తాయి.
అంగులూరి అంజనీదేవి
ఏ మేఘాలూ లేని ఒట్టి నీలిఆకాశం, కళ్ళలో ఏ భావమూ లేని ఓ పసిపాప నిర్మలమైన చూపు, ఊగే గాలికి తలలూపుతూ కాలస్పృహ లేకుండా అలా కంపిస్తూ జీవించే చిగురుటాకులు, ఏ అలలూ లేని ఓ నిద్రించే సరస్సు... ఇవన్నీ ఎంతో సుందరంగా, ఎంతో గంభీరంగా, ఎంతో రమ్యంగా... గాడంగా కూడా ఉంటాయి కదా. కొన్నిసందర్భాల్లో ఏ అలంకారాలూ, నగిషీలూ లేని సరళత కూడా ఓ కొట్టొచ్చిన అందమై భాసిస్తుంది. మనిషి ఎదుటిమనిషిలోని "అమాయకత్వాన్ని" ముచ్చటపడి ప్రేమించేది అందుకే. అంజనీదేవి కధలు కూడా బోసినవ్వుతో నడిచొచ్చే పసిపిల్లలవలె, పట్టుకుందామంటే చిక్కకుండా పారిపోయే చిరు చేపపిల్లలవలె, దోసిట్లోకి ఒదగని సెలయేటి నీటివలె అందీ అందకుండా జారిపోతాయి. ఈమె కధల్లోని పాత్రలన్నీ మన నిత్యజీవతంలో ప్రతి మనిషికీ ప్రతిదినమూ తారసపడేవే. అడుగడుగునా... ఎక్కడో ఒకదగ్గర మన జీవితగమనంలో ఏదో ఒక పార్శ్వంలో మనకు కనిపించి కనుమరుగయ్యేవే. ఏ మధ్యతరగతి కుటుంబంలోనైనా ఈమె సృష్టించి అక్షరబద్ధం చేసిన పాత్రలన్నీ మనకు సజీవంగా మనమధ్య మనను పలకరిస్తాయి. అంజనీదేవి తనకు తెలిసిన పరిమిత ప్రపంచంలో, తానెరిగిన సాధారణ సామాజిక నేపధ్యాలను, ఏ భేషజాలకూ పోకుండా సహజంగా, సరళంగా కధలుగా మలచి వివిధ సందర్భాలలో పాఠకులకు వివిధ ప్రముఖ పత్రికలద్వారా అందిస్తూ వచ్చారు. వీటినిండా మన సమకాలీన సమాజానికి చందిన "ప్రశాంతంగానే" జీవిస్తున్న ఒక సగటు వర్గానికి చెందిన పాత్రలు దర్శనమిస్తాయి. సంఘర్షిస్తాయి. తపిస్తాయి, దుఃఖిస్తాయి. వేదనపడ్తాయి... మన హృదయాల్లోకి సజీవ స్మృతులుగా ప్రవేశించి జ్ఞాపకాలుగా స్ధిరపడ్తాయి. అంగులూరి అంజనీదేవి© 2017,www.logili.com All Rights Reserved.