అమ్మ దొరికింది
చందమామలాంటి మొహం, పెద్ద పెద్ద కళ్ళు, కొనదేరిన ముక్కు ఎంచక్కని పెదవులు, చక్కని పలువరస, నవ్వితే సొట్ట పడుతున్న బుగ్గ, నల్లని ఒత్తైన జుట్టు.....అచ్చం అమ్మలానే ఉంది!
నా ఒంట్లో రక్తంలో మెదడులో ఏదో తెలీని సంచలనం!
శరణాలయపు ఇనుప గ్రిల్డోర్ లోంచి ఆఫీసు గదిలో కూర్చున్న కొత్తమె వంక ఆత్రంగా చూశాను. ఆరాటంగా చూశాను.
ఆమె కళ్ళు - నేను చేతులు కట్టుకుని గడగడా పాఠం అప్పజెప్పినప్పుడు అమ్మ చూసినట్టుగానే చూస్తున్నాయి. అనురాగ ధారల్ని వర్షిస్తున్నాయి.
ఆమె నవ్వింది.
ఉలిక్కిపడ్డాను.
ఒకసారి నేను 'బువ్వ' తిననంటే వెండి గిన్నెలో పెట్టుకుని డాబా మీదకి తీసుకెళ్ళి చందమామని చూపిస్తూ కథలు చెబుతూ గోరుముద్దలు తినిపించింది అమ్మ. నాకు తెలీకుండానే గిన్నెలోనిదంతా తినేశాను. అప్పుడు అమ్మ నా వంక చూసి నవ్వినట్టుగానే ఉందీమె నవ్వు. ఎంత చిత్రం!
సందేహం లేదు ఈమే మా అమ్మ.
మరి ఆగలేకపోయాను. ఇనుప డోర్ తీసి ముందుకెళ్తుంటే నన్ను ఆపబోయింది వరలక్ష్మి. ఆమె చేతుల్ని తోసేసి వార్డెన్ సార్ తో మాట్లాడుతోన్న ఆమె దగ్గరికెళ్ళాను. పొలాన్నుంచి తిరిగొస్తోన్న తల్లి ఆవుకి ఎదురెళ్ళే ఆవుదూడలా గబగబా వెళ్ళాను. ఆమె తప్ప నాకింకెవరూ కన్పించట్లేదు.
“అమ్మా!”
ఆమె తుళ్ళి పడి చూసింది. ఆమె ప్రక్కనున్నతను నుదురు చిట్లించాడు. వార్డెన్ సార్ నోరు తెరిచారు. వాళ్ళనెవర్నీ పట్టించుకోలేదు. అమ్మనే - అమ్మనే చూస్తూ దగ్గరి కెళ్ళాను.................
అమ్మ దొరికింది చందమామలాంటి మొహం, పెద్ద పెద్ద కళ్ళు, కొనదేరిన ముక్కు ఎంచక్కని పెదవులు, చక్కని పలువరస, నవ్వితే సొట్ట పడుతున్న బుగ్గ, నల్లని ఒత్తైన జుట్టు.....అచ్చం అమ్మలానే ఉంది! నా ఒంట్లో రక్తంలో మెదడులో ఏదో తెలీని సంచలనం! శరణాలయపు ఇనుప గ్రిల్డోర్ లోంచి ఆఫీసు గదిలో కూర్చున్న కొత్తమె వంక ఆత్రంగా చూశాను. ఆరాటంగా చూశాను. ఆమె కళ్ళు - నేను చేతులు కట్టుకుని గడగడా పాఠం అప్పజెప్పినప్పుడు అమ్మ చూసినట్టుగానే చూస్తున్నాయి. అనురాగ ధారల్ని వర్షిస్తున్నాయి. ఆమె నవ్వింది. ఉలిక్కిపడ్డాను. ఒకసారి నేను 'బువ్వ' తిననంటే వెండి గిన్నెలో పెట్టుకుని డాబా మీదకి తీసుకెళ్ళి చందమామని చూపిస్తూ కథలు చెబుతూ గోరుముద్దలు తినిపించింది అమ్మ. నాకు తెలీకుండానే గిన్నెలోనిదంతా తినేశాను. అప్పుడు అమ్మ నా వంక చూసి నవ్వినట్టుగానే ఉందీమె నవ్వు. ఎంత చిత్రం! సందేహం లేదు ఈమే మా అమ్మ. మరి ఆగలేకపోయాను. ఇనుప డోర్ తీసి ముందుకెళ్తుంటే నన్ను ఆపబోయింది వరలక్ష్మి. ఆమె చేతుల్ని తోసేసి వార్డెన్ సార్ తో మాట్లాడుతోన్న ఆమె దగ్గరికెళ్ళాను. పొలాన్నుంచి తిరిగొస్తోన్న తల్లి ఆవుకి ఎదురెళ్ళే ఆవుదూడలా గబగబా వెళ్ళాను. ఆమె తప్ప నాకింకెవరూ కన్పించట్లేదు. “అమ్మా!” ఆమె తుళ్ళి పడి చూసింది. ఆమె ప్రక్కనున్నతను నుదురు చిట్లించాడు. వార్డెన్ సార్ నోరు తెరిచారు. వాళ్ళనెవర్నీ పట్టించుకోలేదు. అమ్మనే - అమ్మనే చూస్తూ దగ్గరి కెళ్ళాను.................© 2017,www.logili.com All Rights Reserved.