జ్ఞాపకం పచ్చగా ఉంటుంది. పచ్చిగా ఉంటుంది. వెచ్చగానూ ఉంటుంది. మెచ్చుగా నొచ్చుగా ఎలా ఉండాలో, ఎలా ఉంటుందో అన్నది దాచుకునే మనసుకు సంబంధించింది! జ్ఞాపకం పాతబడిపోదు. అది భూమి పొరల కింద పారే ఏరులాంటిది. సరైన చోట తాకితే ఒక్కసారిగా పైకి ఎగజిమ్ముతుంది. కమాను వీధి కతలు రాస్తున్నప్పుడు. రాశాక నాకు అక్షరాలా తెలిసొచ్చింది! ఇది ఒక వీధే కాదు. నా ఉనికి, మనికి జగతికి చాటిన ఓ జీవన వాహిని! అందుకేనేమో జ్ఞాపకాలను కథా జ్ఞాపికలుగా మలుస్తున్నప్పుడు ఏ ఒక్క తలపూ ఎద తలుపు దాటి పోలేదు. గతంలోంచి గమ్మత్తుగా తొంగి చూస్తున్న అక్షరాలతో అల్లిన ఈ గూడును మనసుతో ఒకసారి తడిమి చూడండి..
జ్ఞాపకం పచ్చగా ఉంటుంది. పచ్చిగా ఉంటుంది. వెచ్చగానూ ఉంటుంది. మెచ్చుగా నొచ్చుగా ఎలా ఉండాలో, ఎలా ఉంటుందో అన్నది దాచుకునే మనసుకు సంబంధించింది! జ్ఞాపకం పాతబడిపోదు. అది భూమి పొరల కింద పారే ఏరులాంటిది. సరైన చోట తాకితే ఒక్కసారిగా పైకి ఎగజిమ్ముతుంది. కమాను వీధి కతలు రాస్తున్నప్పుడు. రాశాక నాకు అక్షరాలా తెలిసొచ్చింది! ఇది ఒక వీధే కాదు. నా ఉనికి, మనికి జగతికి చాటిన ఓ జీవన వాహిని! అందుకేనేమో జ్ఞాపకాలను కథా జ్ఞాపికలుగా మలుస్తున్నప్పుడు ఏ ఒక్క తలపూ ఎద తలుపు దాటి పోలేదు. గతంలోంచి గమ్మత్తుగా తొంగి చూస్తున్న అక్షరాలతో అల్లిన ఈ గూడును మనసుతో ఒకసారి తడిమి చూడండి..© 2017,www.logili.com All Rights Reserved.