ఈ సంకలనంలో మూడు కథలు - చావుదేవర, నిశ్శబ్దపు చప్పుడు, ప్రవల్లిక నిర్ణయం - ప్రాథమికంగా స్త్రీ స్వేచ్చకి సంబంధించినవి. కులమతాలు, ఆర్ధిక వ్యత్యాసాలు, ఆధిపత్యాలు సహజ ప్రేమల్ని శాసించే శక్తులు కావటం ఎప్పటి నుంచో చూస్తున్న దృశ్యమే. ఆ మృగత్వాన్ని ఎదిరించే స్వేచ్చాశక్తి యువతీ యువతుల్లో కలిగినప్పుడు ఎద్దుల్లాంటి వ్యవస్థలు నెలమట్టం అవుతాయని చావుదేవర కథ చెపుతుంది.
స్త్రీ జీవితం అధునాతనమైనా రకరకాల వ్యూహాల మధ్య మగవాడి చెప్పుచేతల్లోనే మసులుతుంది. ఒక్కొక్కసారి స్వీయ నియంత్రణలో నలుగుడు పడుతోంది. అయితే సంక్లిష్ట పరిస్థితుల్లో కాస్త తొట్రుపాటుపడినా నిర్ణాయక స్వేచ్చ తీసుకొనే దృఢ మహిళలు కిరణ్మయి, ప్రవల్లిక నిశ్శబ్దపు చప్పుడు, ప్రవల్లిక నిర్ణయం కథల్లో కన్పిస్తారు. సున్నితమైన సమస్యల్ని అంతే సున్నితంగా ఆవిష్కరించిన కథలివి.
ఈ సంకలనంలో మూడు కథలు - చావుదేవర, నిశ్శబ్దపు చప్పుడు, ప్రవల్లిక నిర్ణయం - ప్రాథమికంగా స్త్రీ స్వేచ్చకి సంబంధించినవి. కులమతాలు, ఆర్ధిక వ్యత్యాసాలు, ఆధిపత్యాలు సహజ ప్రేమల్ని శాసించే శక్తులు కావటం ఎప్పటి నుంచో చూస్తున్న దృశ్యమే. ఆ మృగత్వాన్ని ఎదిరించే స్వేచ్చాశక్తి యువతీ యువతుల్లో కలిగినప్పుడు ఎద్దుల్లాంటి వ్యవస్థలు నెలమట్టం అవుతాయని చావుదేవర కథ చెపుతుంది. స్త్రీ జీవితం అధునాతనమైనా రకరకాల వ్యూహాల మధ్య మగవాడి చెప్పుచేతల్లోనే మసులుతుంది. ఒక్కొక్కసారి స్వీయ నియంత్రణలో నలుగుడు పడుతోంది. అయితే సంక్లిష్ట పరిస్థితుల్లో కాస్త తొట్రుపాటుపడినా నిర్ణాయక స్వేచ్చ తీసుకొనే దృఢ మహిళలు కిరణ్మయి, ప్రవల్లిక నిశ్శబ్దపు చప్పుడు, ప్రవల్లిక నిర్ణయం కథల్లో కన్పిస్తారు. సున్నితమైన సమస్యల్ని అంతే సున్నితంగా ఆవిష్కరించిన కథలివి.© 2017,www.logili.com All Rights Reserved.