శొంఠి జయప్రకాష్ గారు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, పదేళ్లుగా నాకు పరిచయం, అడపాదడపా రచనలు చేస్తుండేవారు, ఇంగ్లీషు సాహిత్యమంటే మక్కువ, తనకు నచ్చిన కథలను ఇంగ్లీషు నుండి తెలుగుకు అనువదిస్తుండే వారు. అనువాద కథలే గాక స్వతంత్రంగా కూడా తెలుగు కథలు రాస్తుండేవారు. మేము ఎప్పుడు కలిసినా కథల గురించే మాట్లాడుకొనే వాళ్ళం. కథకుడిగా వెలిగిపోవాలనే ఉద్దేశం ఆయనకు లేదు - తాను రాసిన అనువాద కథలను ఒక సంపుటిగా, తెలుగు కథలను మరో సంపుటిగా ప్రచురించి మిత్రులకు అందించాలని మాత్రమే ఆయనకున్న చిన్నకోరిక. ఆ కోరిక నుండి వేలువరిస్తిన్నదే ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ అనువాద కథల సంపుటి. అమెరికన్ కథలు, ఇంగ్లీషు కథలు, స్పానిష్ కథలు, ఫ్రెంచి కథలూ కలగలిపిన వైవిధ్యభరితమైన కథల సంపుటి ఇది, కథాసాహిత్యం పట్ల రచయితకున్న ప్రీతికి ఒక చిన్న రుజువు ఈ పుస్తకం!
శొంఠి జయప్రకాష్ గారు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, పదేళ్లుగా నాకు పరిచయం, అడపాదడపా రచనలు చేస్తుండేవారు, ఇంగ్లీషు సాహిత్యమంటే మక్కువ, తనకు నచ్చిన కథలను ఇంగ్లీషు నుండి తెలుగుకు అనువదిస్తుండే వారు. అనువాద కథలే గాక స్వతంత్రంగా కూడా తెలుగు కథలు రాస్తుండేవారు. మేము ఎప్పుడు కలిసినా కథల గురించే మాట్లాడుకొనే వాళ్ళం. కథకుడిగా వెలిగిపోవాలనే ఉద్దేశం ఆయనకు లేదు - తాను రాసిన అనువాద కథలను ఒక సంపుటిగా, తెలుగు కథలను మరో సంపుటిగా ప్రచురించి మిత్రులకు అందించాలని మాత్రమే ఆయనకున్న చిన్నకోరిక. ఆ కోరిక నుండి వేలువరిస్తిన్నదే ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ అనువాద కథల సంపుటి. అమెరికన్ కథలు, ఇంగ్లీషు కథలు, స్పానిష్ కథలు, ఫ్రెంచి కథలూ కలగలిపిన వైవిధ్యభరితమైన కథల సంపుటి ఇది, కథాసాహిత్యం పట్ల రచయితకున్న ప్రీతికి ఒక చిన్న రుజువు ఈ పుస్తకం!© 2017,www.logili.com All Rights Reserved.