కొందరు రాసిన కథలు చెబితే విన్నట్లుగా ఉంటాయి. మరి కొందరివి నాటకమో, సినిమానో చూస్తున్నట్టుగా ఉంటాయి. కానీ, శ్రీమతి గంటి భానుమతి గారి కథలు ఆమె ఆలోచనలకు సమాంతరంగా పాఠకుడి అదే స్థాయిలో అందిస్తాయి. పాఠకుడ్ని పూర్తిగా కథలో లీనం చేస్తాయి. గతంలో ఐదు కథా సంపుటాలు వెలువరించిన గంటి భానుమతి కలం నుండి జాలువారిన జ్ఞాపకాల వెల్లువ లాగా సాగే ఈ కథల సంపుటి 'ఒక్కసారి మా ఊరు పోయిరావాలి.' మొదటి వాక్యంతోనే కథలోకి తల్లీనం చేసే పదిహేను కథల్లో ఎక్కువ కథలు పూర్వాశ్రమ అనుభవాల పరంపరగా సాగుతాయి. ఒకప్పటి గోదావరి గట్టున ఉన్న గ్రామ వైభవం కన్నుల ముందు సాక్షాత్కరింపజేస్తుంది. చాలావరకు ఆలోచనాత్మకంగా సాగేకథలో ఆత్మీయతానుబంధాల్లోని చీకటి కోణాలు కనిపిస్తాయి.
ఈ కథల్లో ఆదర్శవాదం అంతర్లీనంగా గోచరిస్తుంది. కథను హృద్యంగా అందించడంలో భానుమతి గారిది అందే వేసిన చెయ్యి. ఇందులోని 'స్త్రీ' అన్న కథ ఒక ప్రత్యేక ప్రయోగంగా స్త్రీ ఈతి బాధలను వ్యంగ్యాత్మకంగా చూపించి రచయిత్రి ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. తల్లిదండ్రుల మమతానురాగాలే కాకుండా వారి బలహీనతలను ఎత్తి చూపిన కథలు మనల్ని ఆలోచనకు గురిచేస్తాయి. అద్దెగర్భం లాంటి ఆధునికమైన కొన్ని సౌకర్యాలు మహిళల జీవితాలతో చెలగాటమాడి మానవ ప్రవృత్తులని ఎత్తి చూపేవిగా ఉన్నాయి. ఈ విషయంలో రచయిత్రి నిశిత సామాజిక పరిశీలన అభినందనీయం.
ఈ సంపుటిలోని అన్ని కథలు వైవిధ్య భరితంగా, వర్ణనాత్మకంగా, చదివింప చేసేవిగా ఉండి, చదివిన తరువాత చదువ దగ్గవి అనిపిస్తాయి.
- తుమ్మూరి రాంమోహన్ రావు
కొందరు రాసిన కథలు చెబితే విన్నట్లుగా ఉంటాయి. మరి కొందరివి నాటకమో, సినిమానో చూస్తున్నట్టుగా ఉంటాయి. కానీ, శ్రీమతి గంటి భానుమతి గారి కథలు ఆమె ఆలోచనలకు సమాంతరంగా పాఠకుడి అదే స్థాయిలో అందిస్తాయి. పాఠకుడ్ని పూర్తిగా కథలో లీనం చేస్తాయి. గతంలో ఐదు కథా సంపుటాలు వెలువరించిన గంటి భానుమతి కలం నుండి జాలువారిన జ్ఞాపకాల వెల్లువ లాగా సాగే ఈ కథల సంపుటి 'ఒక్కసారి మా ఊరు పోయిరావాలి.' మొదటి వాక్యంతోనే కథలోకి తల్లీనం చేసే పదిహేను కథల్లో ఎక్కువ కథలు పూర్వాశ్రమ అనుభవాల పరంపరగా సాగుతాయి. ఒకప్పటి గోదావరి గట్టున ఉన్న గ్రామ వైభవం కన్నుల ముందు సాక్షాత్కరింపజేస్తుంది. చాలావరకు ఆలోచనాత్మకంగా సాగేకథలో ఆత్మీయతానుబంధాల్లోని చీకటి కోణాలు కనిపిస్తాయి. ఈ కథల్లో ఆదర్శవాదం అంతర్లీనంగా గోచరిస్తుంది. కథను హృద్యంగా అందించడంలో భానుమతి గారిది అందే వేసిన చెయ్యి. ఇందులోని 'స్త్రీ' అన్న కథ ఒక ప్రత్యేక ప్రయోగంగా స్త్రీ ఈతి బాధలను వ్యంగ్యాత్మకంగా చూపించి రచయిత్రి ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. తల్లిదండ్రుల మమతానురాగాలే కాకుండా వారి బలహీనతలను ఎత్తి చూపిన కథలు మనల్ని ఆలోచనకు గురిచేస్తాయి. అద్దెగర్భం లాంటి ఆధునికమైన కొన్ని సౌకర్యాలు మహిళల జీవితాలతో చెలగాటమాడి మానవ ప్రవృత్తులని ఎత్తి చూపేవిగా ఉన్నాయి. ఈ విషయంలో రచయిత్రి నిశిత సామాజిక పరిశీలన అభినందనీయం. ఈ సంపుటిలోని అన్ని కథలు వైవిధ్య భరితంగా, వర్ణనాత్మకంగా, చదివింప చేసేవిగా ఉండి, చదివిన తరువాత చదువ దగ్గవి అనిపిస్తాయి. - తుమ్మూరి రాంమోహన్ రావు© 2017,www.logili.com All Rights Reserved.