కథలు చాలామంది రాస్తారు. కానీ ఆ రాసేటప్పుడు రచయిత్రి గా తమకు కూడా కొంత సామాజిక బాధ్యత ఉందని తెలుసుకొని రాయడం కొంతమంది రచయితలకే సాధ్యం. అటువంటి రచయిత్రులలో ఒకరు ఈ సుజల గంటి. సమస్య ఎదురైతే పరిష్కారం సూచించే దిశగా ఆవిడ కథలుంటాయి. సహజంగా స్నేహశీలి, నలుగురితో కలిసిపోయే స్వభావం గల సుజల రాసిన కథలు కూడా అలాగే ఆదర్శవంతంగా ఉంటాయి. సంస్కరవంతమయిన కుటుంబంలోంచి వచ్చిన సుజలకు కుటుంబంలో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలెలా ఉండాలో, మారుతున్న కాలంలో ఎలా ఉంటే కుటుంబమన్నది సవ్యంగా సాగుతుందో ఆవిడ కథలలో చక్కగా చెప్పారు.
సాధారణ కుటుంబాలలో జననం, మరణం కూడా ఖరీదైనవే. 'అమ్మ వీలునామా' కథలో సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిన సుందరమ్మ తన మరణాంతరం జరిగే కర్మకాండ పిల్లలకు చర్చనీయాంశం కాకూడదని ఎంతో అభ్యుదయంగా ఆలోచించి తన శవాన్ని ఆస్పత్రికి అప్పగించమని కోరడం చూస్తుంటే చదువుతున్నవారు కంటతడి పెట్టక మానరు.
ఆలోచింపజేసే కథే కాదు ఆహ్లాదపరచే హాస్యకథలు కూడా రచయిత్రి సుజల రాయగలరని నిరూపించారు 'అత్తయ్య పెళ్లిచూపులు', 'శ్రీనివాసకళ్యాణం' కథల్లో రచయిత్రి. ఈ కథలు చదువుతుంటే మనిషిలోని, అన్ని అనుభూతులనీ, సమాజంలోని అన్ని కోణాలనీ రచయిత్రి ఔపోసన పట్టినట్టనిపిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రచయిత్రి సుజలగారి కథలు చదవడం ఒక గొప్ప అనుభూతి.
- జి ఎస్ లక్ష్మి
కథలు చాలామంది రాస్తారు. కానీ ఆ రాసేటప్పుడు రచయిత్రి గా తమకు కూడా కొంత సామాజిక బాధ్యత ఉందని తెలుసుకొని రాయడం కొంతమంది రచయితలకే సాధ్యం. అటువంటి రచయిత్రులలో ఒకరు ఈ సుజల గంటి. సమస్య ఎదురైతే పరిష్కారం సూచించే దిశగా ఆవిడ కథలుంటాయి. సహజంగా స్నేహశీలి, నలుగురితో కలిసిపోయే స్వభావం గల సుజల రాసిన కథలు కూడా అలాగే ఆదర్శవంతంగా ఉంటాయి. సంస్కరవంతమయిన కుటుంబంలోంచి వచ్చిన సుజలకు కుటుంబంలో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలెలా ఉండాలో, మారుతున్న కాలంలో ఎలా ఉంటే కుటుంబమన్నది సవ్యంగా సాగుతుందో ఆవిడ కథలలో చక్కగా చెప్పారు. సాధారణ కుటుంబాలలో జననం, మరణం కూడా ఖరీదైనవే. 'అమ్మ వీలునామా' కథలో సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిన సుందరమ్మ తన మరణాంతరం జరిగే కర్మకాండ పిల్లలకు చర్చనీయాంశం కాకూడదని ఎంతో అభ్యుదయంగా ఆలోచించి తన శవాన్ని ఆస్పత్రికి అప్పగించమని కోరడం చూస్తుంటే చదువుతున్నవారు కంటతడి పెట్టక మానరు. ఆలోచింపజేసే కథే కాదు ఆహ్లాదపరచే హాస్యకథలు కూడా రచయిత్రి సుజల రాయగలరని నిరూపించారు 'అత్తయ్య పెళ్లిచూపులు', 'శ్రీనివాసకళ్యాణం' కథల్లో రచయిత్రి. ఈ కథలు చదువుతుంటే మనిషిలోని, అన్ని అనుభూతులనీ, సమాజంలోని అన్ని కోణాలనీ రచయిత్రి ఔపోసన పట్టినట్టనిపిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రచయిత్రి సుజలగారి కథలు చదవడం ఒక గొప్ప అనుభూతి. - జి ఎస్ లక్ష్మి© 2017,www.logili.com All Rights Reserved.