రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. "గోవులోస్తున్నాయి జాగ్రత్త" లో 'మనిషన్న ప్రతీవాడికి భయం ఉంటుంది. మనిషి తెలివికి భయం కొంత కారణం. భయపడ్డవాడు ఆలోచిస్తాడు. కాని చూడు, భయం వేరు బెంగ వేరు జీవితంలో క్షణంసేపు భయపడొచ్చు కాని గంటసేపు బెంగ పెట్టుకోకూడదు' అంటారు శాస్త్రిగారు.
రావిశాస్త్రిగారు శ్రీశ్రీ బాటలోనే 'ఋక్కులు' మొదలెట్టారు. అందులో తొలి ఋక్కు "కుక్కపిల్ల". ఫ్రీ ఎంటర్ ప్రయిజుని ఆనాడే తూర్పారబట్టారు. "జేబులో డబ్బులేసుకు వెళ్ళేవాళ్ళు ప్రజలు! అవి కొట్టేసి బాంకుల్లో దాచుకునేవాళ్ళు ఎంటర్ ప్రయిజుగాళ్ళు. ఈ సిస్టం కి బ్రిటన్, అమెరికా, రష్యా - పుట్టినిల్లు, మెట్టినిల్లు, గిట్టినిల్లు' అన్నారు. ఆయన రాజకీయాన్ని నిశితంగా పరిశీలించి వాటి నిజస్వరూపాన్ని బయటపెట్టారు. సంజకెంజాయ పార్టీ రంగు మార్చకుండా దిక్కుమార్చిందని వాళ్ళ ఆ దివాళాకోరుతనాన్ని ఎండగట్టారు. "రంగు రంగులాగే ఉండడంచేత అడుగున ఉన్న అజ్ఞానపు జనం మాత్రం అది పాతపార్టీయేననీ, అది వెళ్ళవలసిన దిక్కుకే వెళ్తుందని నమ్ముతూ కూర్చుండిపోయేరు" అని స్పష్టం చేశారు.
రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. "గోవులోస్తున్నాయి జాగ్రత్త" లో 'మనిషన్న ప్రతీవాడికి భయం ఉంటుంది. మనిషి తెలివికి భయం కొంత కారణం. భయపడ్డవాడు ఆలోచిస్తాడు. కాని చూడు, భయం వేరు బెంగ వేరు జీవితంలో క్షణంసేపు భయపడొచ్చు కాని గంటసేపు బెంగ పెట్టుకోకూడదు' అంటారు శాస్త్రిగారు. రావిశాస్త్రిగారు శ్రీశ్రీ బాటలోనే 'ఋక్కులు' మొదలెట్టారు. అందులో తొలి ఋక్కు "కుక్కపిల్ల". ఫ్రీ ఎంటర్ ప్రయిజుని ఆనాడే తూర్పారబట్టారు. "జేబులో డబ్బులేసుకు వెళ్ళేవాళ్ళు ప్రజలు! అవి కొట్టేసి బాంకుల్లో దాచుకునేవాళ్ళు ఎంటర్ ప్రయిజుగాళ్ళు. ఈ సిస్టం కి బ్రిటన్, అమెరికా, రష్యా - పుట్టినిల్లు, మెట్టినిల్లు, గిట్టినిల్లు' అన్నారు. ఆయన రాజకీయాన్ని నిశితంగా పరిశీలించి వాటి నిజస్వరూపాన్ని బయటపెట్టారు. సంజకెంజాయ పార్టీ రంగు మార్చకుండా దిక్కుమార్చిందని వాళ్ళ ఆ దివాళాకోరుతనాన్ని ఎండగట్టారు. "రంగు రంగులాగే ఉండడంచేత అడుగున ఉన్న అజ్ఞానపు జనం మాత్రం అది పాతపార్టీయేననీ, అది వెళ్ళవలసిన దిక్కుకే వెళ్తుందని నమ్ముతూ కూర్చుండిపోయేరు" అని స్పష్టం చేశారు.© 2017,www.logili.com All Rights Reserved.