భాగవతం భావగతం. తెలుగువారి పుణ్యపేటి బమ్మెరపోతన్న తెలుగుదనానికి, తెలుగు భాషా ధనానికి వేనవేలుగులు తొడిగిన మహాకవి. సంస్కృత , తెలుగు పదబంధాలకు అన్యోన్యమైన, అనితర సాధ్యమైన, మదురాయమానమైన భవ్యదాంపత్యాన్ని "పౌరోహిత్యం" చేసి తెలుగు వారు గర్వించే మహాభాగవతాన్ని తెలుగు భాషాభిమానులకు అందించిన సుహృత్తు! మనశ్శాంతి కోసం వ్యాసులవారు భాగవతాన్ని సంస్కృతంలో రచించారు. భాగవతంలోని మొదటి ఘట్టం శ్రీ కృష్ణ నిర్యాణం, భారతంలో చివరి ఘట్టమూ శ్రీ కృష్ణ నిర్యాణమే కదా. ఇది ఒక వైచిత్రి!