అపరిచితుడు
రాత్రి టైమ్ ఏడుకావస్తుంది. నేను రాసిన కథని ఓ వీక్లీకి పంపిద్దామని కొరియర్ ఆఫీసుకెళ్లాను.
“ఈరోజు వెళ్ళిపోయిందండీ. రేపు వెళ్ళుతుందీకవర్ మరి మీకు ఓకేనా?” అని కొరియర్ ఆఫీస్ లో కూర్చున్నతను అన్నాడు.
స్టార్స్లో 'హేహైమోహ్బత్' హిందీ సీరియల్ మిస్ అవుతానేమోనన్న కంగారుతో "సరే, అలాగే రేపే పంపించండి" అని చెప్పి డబ్బు చెల్లించి సైన్చేసి రసీదు తీసుకొని ఆత్రంగా నడుస్తూ రోడ్ మీదికొచ్చి... మలుపు తిరిగి 'రఘునాథ్' పబ్లిక్ స్కూల్ దాకా వచ్చాను. ఆ స్కూల్ గేట్కి మీడియం సైజ్లో ఓ చిత్రం వేలాడుతూంది. 'బి అలర్ట్ అబోవ్ చైన్ స్నాచింగ్' అనే స్లోగన్తో... ఓ స్కూటర్పై ఇద్దరు కూర్చొని ఉన్నారు. వెనకాల కూర్చున్నతను ఓ మహిళమెడలో నుంచి గొలుసు లాగుతుంటే ఆమె విరుచుకుపడుతున్నట్లుగా వేశాడు ఆ చిత్రకారుడు. చిత్రం చాలా బాగుందనిపించింది. లంమ్లో అనేకమంది తల్లులు తమ పిల్లలకి బాక్స్లు ఇవ్వడానికి వస్తారు కదా!... వాళ్ళ జాగ్రత్త కోసం పెట్టారులా ఉందా చిత్రం.
ఏదో గుర్తుకొచ్చినదానిలా వెంటనే నేను పైటచెంగు తీసి మెడచుట్టూ తిప్పుకున్నాను. నా పిచ్చిగాని 'గొలుసు దొంగలకి ఈ పైటచెంగు అడ్డమా? ఇదేమన్న " ఇనుప కవచమా?' అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ మా అపార్ట్మెంట్ ఎస్.వి. నిలయం ఉన్న రోడ్డువైపు తిరిగి గబగబా నడక సాగించాను. రోడ్డంతా చాలా నిర్మానుష్యంగా ఉంది.
ఊహించని విధంగా ఉన్నట్లుండి నా పక్కగా చాలా దగ్గరగా ఓ స్కూటర్ రయ్యిన వచ్చి సడెన్ బ్రేక్తో ఆగింది. భయాందోళనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆగిపోయాను. స్త్రీల మెడల్లోని గొలుసులు లాక్కెళ్ళే దొంగే కాబోలనుకొని రెప్పపాటులో పమిటచెంగును మెడచుట్టూ మరింత బిగ్గరగా లాక్కుంటూ భయంగా చూస్తూ ముందుకెళ్లడానికి ప్రయత్నించాను.............
అపరిచితుడు రాత్రి టైమ్ ఏడుకావస్తుంది. నేను రాసిన కథని ఓ వీక్లీకి పంపిద్దామని కొరియర్ ఆఫీసుకెళ్లాను. “ఈరోజు వెళ్ళిపోయిందండీ. రేపు వెళ్ళుతుందీకవర్ మరి మీకు ఓకేనా?” అని కొరియర్ ఆఫీస్ లో కూర్చున్నతను అన్నాడు. స్టార్స్లో 'హేహైమోహ్బత్' హిందీ సీరియల్ మిస్ అవుతానేమోనన్న కంగారుతో "సరే, అలాగే రేపే పంపించండి" అని చెప్పి డబ్బు చెల్లించి సైన్చేసి రసీదు తీసుకొని ఆత్రంగా నడుస్తూ రోడ్ మీదికొచ్చి... మలుపు తిరిగి 'రఘునాథ్' పబ్లిక్ స్కూల్ దాకా వచ్చాను. ఆ స్కూల్ గేట్కి మీడియం సైజ్లో ఓ చిత్రం వేలాడుతూంది. 'బి అలర్ట్ అబోవ్ చైన్ స్నాచింగ్' అనే స్లోగన్తో... ఓ స్కూటర్పై ఇద్దరు కూర్చొని ఉన్నారు. వెనకాల కూర్చున్నతను ఓ మహిళమెడలో నుంచి గొలుసు లాగుతుంటే ఆమె విరుచుకుపడుతున్నట్లుగా వేశాడు ఆ చిత్రకారుడు. చిత్రం చాలా బాగుందనిపించింది. లంమ్లో అనేకమంది తల్లులు తమ పిల్లలకి బాక్స్లు ఇవ్వడానికి వస్తారు కదా!... వాళ్ళ జాగ్రత్త కోసం పెట్టారులా ఉందా చిత్రం. ఏదో గుర్తుకొచ్చినదానిలా వెంటనే నేను పైటచెంగు తీసి మెడచుట్టూ తిప్పుకున్నాను. నా పిచ్చిగాని 'గొలుసు దొంగలకి ఈ పైటచెంగు అడ్డమా? ఇదేమన్న " ఇనుప కవచమా?' అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ మా అపార్ట్మెంట్ ఎస్.వి. నిలయం ఉన్న రోడ్డువైపు తిరిగి గబగబా నడక సాగించాను. రోడ్డంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. ఊహించని విధంగా ఉన్నట్లుండి నా పక్కగా చాలా దగ్గరగా ఓ స్కూటర్ రయ్యిన వచ్చి సడెన్ బ్రేక్తో ఆగింది. భయాందోళనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆగిపోయాను. స్త్రీల మెడల్లోని గొలుసులు లాక్కెళ్ళే దొంగే కాబోలనుకొని రెప్పపాటులో పమిటచెంగును మెడచుట్టూ మరింత బిగ్గరగా లాక్కుంటూ భయంగా చూస్తూ ముందుకెళ్లడానికి ప్రయత్నించాను.............© 2017,www.logili.com All Rights Reserved.