మహాభారతం ఉద్యోగపర్వంలో సందర్భానుసారముగా విదురుని చేత ధృతరాష్ట్రునికి చెప్పించిన సామజిక రాజకీయ, కౌటుంబిక జీవనానికి చెందిన నీతి శాస్త్ర విషయాలు "విదురనీతి" లుగా ప్రసిద్ధి చెందాయి. వానిలో రాజధర్మములు, సామాన్య ధర్మములు సర్వకాల సర్వావస్థలందు నైతిక, ధార్మిక జీవన సాధకులకు ఉపకరిస్తాయి.
అంధుడైన దృతరాష్ట్రుడు బధిరత్వం వహించడం చేత, దుర్యోధనాదుల రాజ్యాంహకారం చేత వారికీ పనికి రాకుండా పోయిన.... తరతరాలుగా మానవాళికి మహోపకారంగా, సన్మార్గ దర్శకాలుగా, వరప్రసాదంగా అవి మిగిలిపోయాయి.
ఇందులో....
ఆ నలుగురికి నిద్రపట్టదు!
అనుసరించే వారు ఐదుగురు....
ఆశ్రయించేవారు ఆరుగురు...
సప్త లక్షణాలుంటే సుఖీభవ!
ఎన్నో... మరెన్నో విదుర నీతులకు 26 కమ్మని కధారూపాలు ఆకళింపు చేసుకోవాలంటే... ఈ విదురనీతి కధలు చదవాల్సిందే చదివి ఆస్వాదించాల్సిందే!
-సూర్యప్రసాద రావు.