ధర్మ సందర్భం - ధార్మిక అనుబంధం
తెలుగునాట బుద్ధ ధర్మయునిగా, బుద్ధధమ్మాచరణలో జీవితాన్ని నిండుగా నడుపుకుంటూ, సమాజ వికాసానికి ఎంతగానో ఉపకరించే బుద్ధధార్మిక, అంబేడ్కర్ మరియు సామాజిక రచనలను గత ముప్పయి |
యేండ్లుగా రచిస్తూ, ప్రచురిస్తూ వున్న శ్రీ డి. నటరాజ్ శాక్య, తెలుగునాట ఉభయ రాష్ట్రాల వారికీ బుద్ధధర్మయుడిగా, అంబేడ్కరిస్టుగా పరిచయస్తులే. వీరు రచించిన అన్ని గ్రంథాలు వలుమార్లు
ముద్రింపబడటంతో పాటు, బుద్ధధర్మ వికాసానికి ఎంతో ఉపయోగపడుతూ వున్నాయి. వీరి ప్రముఖ రచన అయిన, “నిత్య నిర్వాణ 'ఆనందపథం - బుద్ధనాగార్జునుల బోధనల సమాహారం” అనే గ్రంథాన్నీ, 'బుద్ధధర్మం - భార్యాభర్తల అనుబంధం' అనే గ్రంథాన్ని మా లతారాజా ఫౌండేషన్ ప్రచురించింది. బుద్ధధర్మాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి ఆయన వ్యవహారిక భాషలో చేస్తున్న కృషి మిగుల అభినందనీయం.
అదే మార్గంలో ఆయన బుద్ధధర్మంలోని అత్యంత ప్రగాఢమైన విషయాలను కూడా, అత్యంత తేటతెల్లంగా, సుబోధకంగా, రాసిన వ్యాసాలను, బోధిచిత్త - శాంతిచిత్త - కారుణ్యచిత్త అనే గ్రంథాలుగా ముద్రిస్తూ వున్నందుకు చాలా సంతోషిస్తూ వున్నాము. ఈ గ్రంథాలలోని వ్యాసాలను వారు తల్లి బిడ్డలకు చెప్పినట్లు, గురువులు ప్రియమైన శిష్యులకు చెప్పినట్లు, సస్నేహంగా ఎంతో చక్కగా రాశారు. వారి కృషి అభినందనీయం. ఈ గ్రంథాలు కూడా సామాన్య ప్రజలలో బుద్ధధమ్మానురక్తిని కల్గించడంలో నిరుపమానంగా తోడ్పడతాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బుద్ధధర్మ పరివ్యాప్తికి మా లతారాజా ఫౌండేషన్ చేస్తున్న కృషి, అందరి ఆదరాభిమానాలనూ పొందుతుందని ఆశిస్తున్నాను.............
ధర్మ సందర్భం - ధార్మిక అనుబంధం తెలుగునాట బుద్ధ ధర్మయునిగా, బుద్ధధమ్మాచరణలో జీవితాన్ని నిండుగా నడుపుకుంటూ, సమాజ వికాసానికి ఎంతగానో ఉపకరించే బుద్ధధార్మిక, అంబేడ్కర్ మరియు సామాజిక రచనలను గత ముప్పయి | యేండ్లుగా రచిస్తూ, ప్రచురిస్తూ వున్న శ్రీ డి. నటరాజ్ శాక్య, తెలుగునాట ఉభయ రాష్ట్రాల వారికీ బుద్ధధర్మయుడిగా, అంబేడ్కరిస్టుగా పరిచయస్తులే. వీరు రచించిన అన్ని గ్రంథాలు వలుమార్లు ముద్రింపబడటంతో పాటు, బుద్ధధర్మ వికాసానికి ఎంతో ఉపయోగపడుతూ వున్నాయి. వీరి ప్రముఖ రచన అయిన, “నిత్య నిర్వాణ 'ఆనందపథం - బుద్ధనాగార్జునుల బోధనల సమాహారం” అనే గ్రంథాన్నీ, 'బుద్ధధర్మం - భార్యాభర్తల అనుబంధం' అనే గ్రంథాన్ని మా లతారాజా ఫౌండేషన్ ప్రచురించింది. బుద్ధధర్మాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి ఆయన వ్యవహారిక భాషలో చేస్తున్న కృషి మిగుల అభినందనీయం. అదే మార్గంలో ఆయన బుద్ధధర్మంలోని అత్యంత ప్రగాఢమైన విషయాలను కూడా, అత్యంత తేటతెల్లంగా, సుబోధకంగా, రాసిన వ్యాసాలను, బోధిచిత్త - శాంతిచిత్త - కారుణ్యచిత్త అనే గ్రంథాలుగా ముద్రిస్తూ వున్నందుకు చాలా సంతోషిస్తూ వున్నాము. ఈ గ్రంథాలలోని వ్యాసాలను వారు తల్లి బిడ్డలకు చెప్పినట్లు, గురువులు ప్రియమైన శిష్యులకు చెప్పినట్లు, సస్నేహంగా ఎంతో చక్కగా రాశారు. వారి కృషి అభినందనీయం. ఈ గ్రంథాలు కూడా సామాన్య ప్రజలలో బుద్ధధమ్మానురక్తిని కల్గించడంలో నిరుపమానంగా తోడ్పడతాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బుద్ధధర్మ పరివ్యాప్తికి మా లతారాజా ఫౌండేషన్ చేస్తున్న కృషి, అందరి ఆదరాభిమానాలనూ పొందుతుందని ఆశిస్తున్నాను.............© 2017,www.logili.com All Rights Reserved.