త్రికాలాలకీ అతీతమైన... త్రివిక్రమ స్వరూప... నటరాజుకి స్త్రీరూపం సావిత్రి...! ఒక్కసావిత్రికే ఈ వాక్యం వాడొచ్చు. ఆమె నభూతో న భవిష్యతి...!
డాక్టర్ కంపల్లె రవిచంద్రన్... తెలుగు సినీ అభిమానులకు చాలా ఇష్టమైన పేరు... ఆయన ఆదివారం ఆంద్రజ్యోతిలో నిర్వహించిన "జ్ఞాపకాలు" శీర్షిక అశేష పాఠకులను ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురుచూసేటట్లు చేసింది. తెరమీది, తెరవెనుక విశేషాలను చాలా ఆకర్షణీయమైన శైలిలో చెప్పగలరు రవిచంద్రన్. ఆయన రాసిన సినిమా వ్యాసాలు చదవడమంటే షడ్రషోపెతమైన విందు ఆరగించినట్లే. వారి కలం నుండి వెలువడిన ఈ గ్రంథం సావిత్రిని మరలా మనకు పరిచయం చేయబోతున్నది. సావిత్రి 80వ పుట్టినరోజు సంస్మరణగా సావిత్రి గురించి లోగడ మనకు తెలియని అనేక విషయాలతో, అరుదైన ఛాయాచిత్రాలతో 'సావిత్రి కరిగిపోయిన కర్పూరకళిక' ను ప్రచురించారు ఆమె 'వీరాభిమాని' కంఠంనేని వెంకటేశ్వరరావు.
త్రికాలాలకీ అతీతమైన... త్రివిక్రమ స్వరూప... నటరాజుకి స్త్రీరూపం సావిత్రి...! ఒక్కసావిత్రికే ఈ వాక్యం వాడొచ్చు. ఆమె నభూతో న భవిష్యతి...! డాక్టర్ కంపల్లె రవిచంద్రన్... తెలుగు సినీ అభిమానులకు చాలా ఇష్టమైన పేరు... ఆయన ఆదివారం ఆంద్రజ్యోతిలో నిర్వహించిన "జ్ఞాపకాలు" శీర్షిక అశేష పాఠకులను ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురుచూసేటట్లు చేసింది. తెరమీది, తెరవెనుక విశేషాలను చాలా ఆకర్షణీయమైన శైలిలో చెప్పగలరు రవిచంద్రన్. ఆయన రాసిన సినిమా వ్యాసాలు చదవడమంటే షడ్రషోపెతమైన విందు ఆరగించినట్లే. వారి కలం నుండి వెలువడిన ఈ గ్రంథం సావిత్రిని మరలా మనకు పరిచయం చేయబోతున్నది. సావిత్రి 80వ పుట్టినరోజు సంస్మరణగా సావిత్రి గురించి లోగడ మనకు తెలియని అనేక విషయాలతో, అరుదైన ఛాయాచిత్రాలతో 'సావిత్రి కరిగిపోయిన కర్పూరకళిక' ను ప్రచురించారు ఆమె 'వీరాభిమాని' కంఠంనేని వెంకటేశ్వరరావు.© 2017,www.logili.com All Rights Reserved.