నేనీ గ్రంధంలో ఇందిరాగాంధీని పరిచయం చేయదలచుకొన్నాను. ఆమె వ్యక్తీగతజీవితంలోని జయాపజయాలను, అదృష్ట దురదృష్ట విషయాలను ప్రస్తావించ దలచుకోలేదు. భారతదేశంలోనూ, ప్రపంచంలోనూ క్రమానుగతంగా వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి, ఆయా సందర్భాలలో ఆమెను ప్రభావితం చేసిన సంఘటనలు, ఆమెను తీర్చిదిద్ది వ్యక్తిత్వాన్ని రూపొందింపజేసిన సంఘటనలూ తీసుకొని ఆమెను పరిచయం చేయదలిచాను. ఇది ఇందిర జీవితగాధ మాత్రమే కాదు ; ఆమె జనకుడు, మిత్రుడు, వేదాంతి, మార్గదర్శకుడూ అయిన జవహర్లాల్ నెహ్రు గాధకూడా. నెహ్రు ప్రభావం లక్షలాది భారతయువకుల భావాలమీదా, ప్రవర్తనలమీదా ప్రసరించింది. అలాగే ఇందిరాగాంధీ కూడా ప్రభావితు రాలయింది. ఇందిరాగాధ భారతజనతగాధ.
- కె.ఎ. అబ్బాస్
నేనీ గ్రంధంలో ఇందిరాగాంధీని పరిచయం చేయదలచుకొన్నాను. ఆమె వ్యక్తీగతజీవితంలోని జయాపజయాలను, అదృష్ట దురదృష్ట విషయాలను ప్రస్తావించ దలచుకోలేదు. భారతదేశంలోనూ, ప్రపంచంలోనూ క్రమానుగతంగా వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి, ఆయా సందర్భాలలో ఆమెను ప్రభావితం చేసిన సంఘటనలు, ఆమెను తీర్చిదిద్ది వ్యక్తిత్వాన్ని రూపొందింపజేసిన సంఘటనలూ తీసుకొని ఆమెను పరిచయం చేయదలిచాను. ఇది ఇందిర జీవితగాధ మాత్రమే కాదు ; ఆమె జనకుడు, మిత్రుడు, వేదాంతి, మార్గదర్శకుడూ అయిన జవహర్లాల్ నెహ్రు గాధకూడా. నెహ్రు ప్రభావం లక్షలాది భారతయువకుల భావాలమీదా, ప్రవర్తనలమీదా ప్రసరించింది. అలాగే ఇందిరాగాంధీ కూడా ప్రభావితు రాలయింది. ఇందిరాగాధ భారతజనతగాధ. - కె.ఎ. అబ్బాస్© 2017,www.logili.com All Rights Reserved.