దేశానికి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఏళ్ళు పూర్తయింది. స్వాతంత్ర్య ఫలాలు కొందరికే పరిమితమయ్యాయి. దేశంలో అధికసంఖ్యలో ఉన్న పేదలు, దళితులు, మైనారిటీ ప్రజలకు అందడం లేదు. తెల్లవారి నుంచి నల్లవారి చేతుల్లోకి పాలన మారినా అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేదన్నది జగమెరిగిన సత్యం. పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల ఫలితంగా ధనికులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్న పరిస్థితి. 58 శాతం సంపద కేవలం ఒక శాతంగా ఉన్న ధనికుల వద్ద పోగుబడింది. 67 శాతం మంది ప్రజలు నెలకు పదివేల రూపాయలు కూడా సంపాదించుకోలేని స్థితిలో ఉన్నారు. 80 శాతం మంది పౌష్టికాహారం తీసుకోలేని స్థితిలో ఉన్నారు.
సామాన్యులకే కాదు మధ్య తరగతి వారికి కూడా సరైన గూడు ఒక కలగా మారింది. దేశంలో నేటికీ 65 శాతం మంది జనాభా మురికివాడల్లోనే నివసిస్తున్నారు. 25 శాతం మంది ప్రజలకు విద్యుత్తు అందుబాటులో లేదు. విద్యవైద్యం పూర్తిగా వ్యాపారమయమైపోయింది. చదువు 'కొన'లేక 64 శాతం మంది ప్రాథమిక విద్య దశలో, 30 శాతం మంది మాధ్యమిక విద్య దశలో చదువుకు స్వస్తి పలికేస్తున్న పరిస్థితి. దేశంలో ఏ లక్ష్యాలతో స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారో ఆ లక్ష్యాలు ప్రజలకింకా కనుచూపు మేరలో లేవన్నది పుస్తక సారాంశం. పీపుల్స్ డెమక్రసీ, ఫ్రంట్ లైన్ లో ప్రచురితమైన వ్యాసాల సంగ్రహమే ఈ 'ఏడుపదుల స్వాతంత్ర్యం'.
దేశానికి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఏళ్ళు పూర్తయింది. స్వాతంత్ర్య ఫలాలు కొందరికే పరిమితమయ్యాయి. దేశంలో అధికసంఖ్యలో ఉన్న పేదలు, దళితులు, మైనారిటీ ప్రజలకు అందడం లేదు. తెల్లవారి నుంచి నల్లవారి చేతుల్లోకి పాలన మారినా అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేదన్నది జగమెరిగిన సత్యం. పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల ఫలితంగా ధనికులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్న పరిస్థితి. 58 శాతం సంపద కేవలం ఒక శాతంగా ఉన్న ధనికుల వద్ద పోగుబడింది. 67 శాతం మంది ప్రజలు నెలకు పదివేల రూపాయలు కూడా సంపాదించుకోలేని స్థితిలో ఉన్నారు. 80 శాతం మంది పౌష్టికాహారం తీసుకోలేని స్థితిలో ఉన్నారు. సామాన్యులకే కాదు మధ్య తరగతి వారికి కూడా సరైన గూడు ఒక కలగా మారింది. దేశంలో నేటికీ 65 శాతం మంది జనాభా మురికివాడల్లోనే నివసిస్తున్నారు. 25 శాతం మంది ప్రజలకు విద్యుత్తు అందుబాటులో లేదు. విద్యవైద్యం పూర్తిగా వ్యాపారమయమైపోయింది. చదువు 'కొన'లేక 64 శాతం మంది ప్రాథమిక విద్య దశలో, 30 శాతం మంది మాధ్యమిక విద్య దశలో చదువుకు స్వస్తి పలికేస్తున్న పరిస్థితి. దేశంలో ఏ లక్ష్యాలతో స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారో ఆ లక్ష్యాలు ప్రజలకింకా కనుచూపు మేరలో లేవన్నది పుస్తక సారాంశం. పీపుల్స్ డెమక్రసీ, ఫ్రంట్ లైన్ లో ప్రచురితమైన వ్యాసాల సంగ్రహమే ఈ 'ఏడుపదుల స్వాతంత్ర్యం'.© 2017,www.logili.com All Rights Reserved.