బాలగోపాల్ మొత్తం ఆలోచనా క్రమాన్ని వడబోస్తే మానవ సమాజ ప్రగతికి, ఉద్యమాలకు, విప్లవపోరాటాలకు ఒక నైతిక, తాత్విక పునాది ఉండాలని, ఆ పునాది విస్తృతమయ్యే క్రమంలోనే సామాజిక సంబంధాలలో ఉన్నతమైన మానవీయ విలువలు వ్యవస్థీకృతం కావాలని ఆయన ప్రగాఢంగా వాంచించినట్టు అర్థమవుతుంది.
ఈ విలువల విస్తరణకు కావలసిన భౌతిక పునాది మార్పును సంపూర్ణంగా సమర్థిస్తూనే ఆ మార్పు కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలు కూడా మానవ చైతన్యాన్ని పెంచే దిశగా ఉండాలని, భౌతిక పునాదిలో మార్పు దానికదే మానవ చైతన్యాన్ని పెంచదని, అది ఒక మేరకు మానవ చైతన్యాన్ని ప్రభావితం చేసినా ఆ ప్రభావం ఉన్నత విలువల వ్యవస్థీకరణకు దోహదపడకపోతే వచ్చిన మార్పు స్థిరపడదని, అది స్థిరపడకపొతే సమాజ ప్రగతి ఆటుపోటులకు గురై మనం సాధించుకోవాలన్న లేదా సాధించుకున్న ఉన్నత సమాజం ప్రమాదంలో పడుతుందని, ఆ చారిత్రిక అనుభవం సోషలిస్టు సమాజాల పతనం మనకు అందించిందని ఆయన అవగాహన. ఈ పుస్తకంలోని వ్యాసాలను ఈ చట్రం నుండి అర్థం చేసుకుని విశ్లేషించవలసిన అవసరం ఉందని పర్ స్పెక్టివ్స్ భావిస్తున్నది.
- జి హరగోపాల్
బాలగోపాల్ మొత్తం ఆలోచనా క్రమాన్ని వడబోస్తే మానవ సమాజ ప్రగతికి, ఉద్యమాలకు, విప్లవపోరాటాలకు ఒక నైతిక, తాత్విక పునాది ఉండాలని, ఆ పునాది విస్తృతమయ్యే క్రమంలోనే సామాజిక సంబంధాలలో ఉన్నతమైన మానవీయ విలువలు వ్యవస్థీకృతం కావాలని ఆయన ప్రగాఢంగా వాంచించినట్టు అర్థమవుతుంది. ఈ విలువల విస్తరణకు కావలసిన భౌతిక పునాది మార్పును సంపూర్ణంగా సమర్థిస్తూనే ఆ మార్పు కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలు కూడా మానవ చైతన్యాన్ని పెంచే దిశగా ఉండాలని, భౌతిక పునాదిలో మార్పు దానికదే మానవ చైతన్యాన్ని పెంచదని, అది ఒక మేరకు మానవ చైతన్యాన్ని ప్రభావితం చేసినా ఆ ప్రభావం ఉన్నత విలువల వ్యవస్థీకరణకు దోహదపడకపోతే వచ్చిన మార్పు స్థిరపడదని, అది స్థిరపడకపొతే సమాజ ప్రగతి ఆటుపోటులకు గురై మనం సాధించుకోవాలన్న లేదా సాధించుకున్న ఉన్నత సమాజం ప్రమాదంలో పడుతుందని, ఆ చారిత్రిక అనుభవం సోషలిస్టు సమాజాల పతనం మనకు అందించిందని ఆయన అవగాహన. ఈ పుస్తకంలోని వ్యాసాలను ఈ చట్రం నుండి అర్థం చేసుకుని విశ్లేషించవలసిన అవసరం ఉందని పర్ స్పెక్టివ్స్ భావిస్తున్నది. - జి హరగోపాల్© 2017,www.logili.com All Rights Reserved.