ఇప్పుడు కావలసింది మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని అసమగ్రతనూ అపరిపక్వతనూ పోగొట్టే కృషి. దానిని లోతయిన వికేంద్రీకరణ వంటి వ్యవస్థాగత సంస్కరణలు ఎంత అవసరమో, సామాజిక చైతన్యంలో దానికి తగిన విలువలనూ, ఆలోచనలనూ పెంపొందించడానికి కృషి చేయడం కూడా అంతే అవసరం. ఇక్కడ 'మేధావి వర్గం' అని పిలవబడే బుద్ధిజీవుల వైఫల్యం, ప్రసార సాధనాల వైఫల్యం చాలా ఉంది. ప్రజాస్వామ్యాన్ని వీరు వాడుకున్నంతగా ఎవరూ వాడుకోలేదు. అది వీరికి అందుబాటులో ఉన్నంతగా వేరే ఎవరికీ లేదు. కానీ దానిని బలోపేతం చేయడానికి వీరు చేస్తున్న కృషి మాత్రం స్వల్పం.
దాని బదులు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రతిపాదనలను వెనకేసుకొచ్చేవారు కొందరయితే, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న రాజకీయ పార్టీలకూ నాయకులకూ అందమయిన రంగులు పూసి దాని విధ్వంసానికి తోడ్పడే వారు మరికొందరు. ప్రజాస్వామ్యాన్ని వాడుకోవడమే తప్ప దానికి బలం చేకూర్చే కర్తవ్యం తమది కాదని ఈ దేశంలో అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంలో అందరి కంటే ఎక్కువ బాధ్యత బుద్ధిజీవులు, పత్రికలు, ప్రసార సాధనాలపై పెట్టక తప్పదు.
ఇప్పుడు కావలసింది మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని అసమగ్రతనూ అపరిపక్వతనూ పోగొట్టే కృషి. దానిని లోతయిన వికేంద్రీకరణ వంటి వ్యవస్థాగత సంస్కరణలు ఎంత అవసరమో, సామాజిక చైతన్యంలో దానికి తగిన విలువలనూ, ఆలోచనలనూ పెంపొందించడానికి కృషి చేయడం కూడా అంతే అవసరం. ఇక్కడ 'మేధావి వర్గం' అని పిలవబడే బుద్ధిజీవుల వైఫల్యం, ప్రసార సాధనాల వైఫల్యం చాలా ఉంది. ప్రజాస్వామ్యాన్ని వీరు వాడుకున్నంతగా ఎవరూ వాడుకోలేదు. అది వీరికి అందుబాటులో ఉన్నంతగా వేరే ఎవరికీ లేదు. కానీ దానిని బలోపేతం చేయడానికి వీరు చేస్తున్న కృషి మాత్రం స్వల్పం. దాని బదులు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రతిపాదనలను వెనకేసుకొచ్చేవారు కొందరయితే, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న రాజకీయ పార్టీలకూ నాయకులకూ అందమయిన రంగులు పూసి దాని విధ్వంసానికి తోడ్పడే వారు మరికొందరు. ప్రజాస్వామ్యాన్ని వాడుకోవడమే తప్ప దానికి బలం చేకూర్చే కర్తవ్యం తమది కాదని ఈ దేశంలో అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంలో అందరి కంటే ఎక్కువ బాధ్యత బుద్ధిజీవులు, పత్రికలు, ప్రసార సాధనాలపై పెట్టక తప్పదు.© 2017,www.logili.com All Rights Reserved.