బడుగువర్గాల జీవితాలు బాగుపడడాన్ని మనం ఇంకా 'అభివృద్ధి'గా అర్థం చేసుకోవడం లేదు. సంక్షేమంగా మాత్రమే అర్థం చేసుకుంటున్నాం. 'అభివృద్ధి' ఆదాయాన్ని తెచ్చిపెడితే 'సంక్షేమం' ఖర్చును పెంచుతుందని చెప్పి దానిని ఒక కంట కనిపెట్టి ఉంచాలనుకుంటాం. చవక బియ్యం, ఉచితకరెంటు, ఎస్ సి, బి సి స్కాలర్ షిప్ లు, వికలాంగులకు బస్ పాసులు, ఇవన్నీ ప్రభుత్వానికి ఖర్చు పెంచే సంక్షేమ చర్యలు అనుకుంటాము కాబట్టి వీటికొక సీలింగ్ పెట్టి అంతకంటే ఎక్కువ అడగోద్దనీ ఇవ్వొద్దనీ అంటాం. అదే వెడల్పయిన రోడ్లు, టెలికాం లైన్లు, పర్యాటక కేంద్రాలు - ఇటువంటివయితే 'అభివృద్ధి'కి సంబంధించిన విషయాలనీ, వాటిపైన ఎంత ఖర్చు పెట్టగలిగితే అంత మంచిదనీ అనుకుంటాం.
కానీ నిజానికి 'సంక్షేమం' అనేది ఎంత 'అభివృద్దో' గ్రహించినట్టయితే ఈ విషయాల గురించి మనం చర్చించే పద్దతే మారిపోతుంది. ప్రభుత్వ ఖజానాకూ ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకూ పెట్టుబడులను వేగంగా జమచేసేది మాత్రమే అభివృద్ధి కాదనీ, ప్రజల జీవితాలను బాగుపరిచేదీ అభివృద్దే అనీ గ్రహించే రోజు ఎప్పుడొస్తుందో.
బడుగువర్గాల జీవితాలు బాగుపడడాన్ని మనం ఇంకా 'అభివృద్ధి'గా అర్థం చేసుకోవడం లేదు. సంక్షేమంగా మాత్రమే అర్థం చేసుకుంటున్నాం. 'అభివృద్ధి' ఆదాయాన్ని తెచ్చిపెడితే 'సంక్షేమం' ఖర్చును పెంచుతుందని చెప్పి దానిని ఒక కంట కనిపెట్టి ఉంచాలనుకుంటాం. చవక బియ్యం, ఉచితకరెంటు, ఎస్ సి, బి సి స్కాలర్ షిప్ లు, వికలాంగులకు బస్ పాసులు, ఇవన్నీ ప్రభుత్వానికి ఖర్చు పెంచే సంక్షేమ చర్యలు అనుకుంటాము కాబట్టి వీటికొక సీలింగ్ పెట్టి అంతకంటే ఎక్కువ అడగోద్దనీ ఇవ్వొద్దనీ అంటాం. అదే వెడల్పయిన రోడ్లు, టెలికాం లైన్లు, పర్యాటక కేంద్రాలు - ఇటువంటివయితే 'అభివృద్ధి'కి సంబంధించిన విషయాలనీ, వాటిపైన ఎంత ఖర్చు పెట్టగలిగితే అంత మంచిదనీ అనుకుంటాం. కానీ నిజానికి 'సంక్షేమం' అనేది ఎంత 'అభివృద్దో' గ్రహించినట్టయితే ఈ విషయాల గురించి మనం చర్చించే పద్దతే మారిపోతుంది. ప్రభుత్వ ఖజానాకూ ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకూ పెట్టుబడులను వేగంగా జమచేసేది మాత్రమే అభివృద్ధి కాదనీ, ప్రజల జీవితాలను బాగుపరిచేదీ అభివృద్దే అనీ గ్రహించే రోజు ఎప్పుడొస్తుందో.© 2017,www.logili.com All Rights Reserved.