"అసాధారణ సాధారణ మానవుడు ఒక గొప్ప అల్పమానవుడు. అపారమైన శక్తియుక్తులు, అవకాశాలు వున్నవాడు. ఇట్టి విశిష్ట గౌరవాన్ని తాను స్వయంగా గావించే సామాజిక జీవనచర్యల వలన పొందినట్టి సమాజనిర్మాత, సమాజ కార్మికుడు అయిన శ్రమజీవన సౌందర్యమూర్తి" అని అంటూ ప్రసిద్ధ రష్యన్ సాహిత్యవిమర్శకుడు యూరీ బరబాష్ 'ఈస్తటిక్స్ అండ్ పోయటిక్స్" అన్న తన ప్రసిద్ధరచనలో అంటాడు. ఈ కోణంలో గమనిస్తే శ్రేయోదాయక సామాజిక నిర్మాణంలో వర్తమాన భారతీయసమాజంలో వారసత్వకులవృత్తుల్లో ప్రముఖస్థానం గల చేనేతకారుడు 'అసాధారణ సాధారణ మానవుడు ఒక గొప్ప అల్పమానవుడు' అనడానికి ఒక చక్కని ఉదాహరణగా మిగిలిపోయాడు.
ప్రస్తుతకాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు కొనసాగుతున్న చేనేతరంగం గతప్రభావాన్ని, ప్రస్తుతస్థితిని సామాజికంగాను, సాహిత్యపరంగాను పాఠకులకు పరిచయం చేయాలన్న ఒక చిన్న ప్రయత్నం ఇది. అంతకుమించి మరేమీ లేదు. ఈ ప్రయత్నాన్ని పాఠకులు సాదరంగా స్వీకరిస్తారని భావిస్తున్నాను.
- డా పి రమేష్ నారాయణ
"అసాధారణ సాధారణ మానవుడు ఒక గొప్ప అల్పమానవుడు. అపారమైన శక్తియుక్తులు, అవకాశాలు వున్నవాడు. ఇట్టి విశిష్ట గౌరవాన్ని తాను స్వయంగా గావించే సామాజిక జీవనచర్యల వలన పొందినట్టి సమాజనిర్మాత, సమాజ కార్మికుడు అయిన శ్రమజీవన సౌందర్యమూర్తి" అని అంటూ ప్రసిద్ధ రష్యన్ సాహిత్యవిమర్శకుడు యూరీ బరబాష్ 'ఈస్తటిక్స్ అండ్ పోయటిక్స్" అన్న తన ప్రసిద్ధరచనలో అంటాడు. ఈ కోణంలో గమనిస్తే శ్రేయోదాయక సామాజిక నిర్మాణంలో వర్తమాన భారతీయసమాజంలో వారసత్వకులవృత్తుల్లో ప్రముఖస్థానం గల చేనేతకారుడు 'అసాధారణ సాధారణ మానవుడు ఒక గొప్ప అల్పమానవుడు' అనడానికి ఒక చక్కని ఉదాహరణగా మిగిలిపోయాడు. ప్రస్తుతకాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు కొనసాగుతున్న చేనేతరంగం గతప్రభావాన్ని, ప్రస్తుతస్థితిని సామాజికంగాను, సాహిత్యపరంగాను పాఠకులకు పరిచయం చేయాలన్న ఒక చిన్న ప్రయత్నం ఇది. అంతకుమించి మరేమీ లేదు. ఈ ప్రయత్నాన్ని పాఠకులు సాదరంగా స్వీకరిస్తారని భావిస్తున్నాను. - డా పి రమేష్ నారాయణ© 2017,www.logili.com All Rights Reserved.