నాకు పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే అసహ్యం. దానిని మానవ జాతి ఏ విధంగా అధిగమిస్తుందో ఎవ్వరికి తెలీదని నేను అనుకుంటున్నాను. మార్క్సిజం పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించడానికి పనికి వచ్చినంతగా దానిని అధిగమించడానికి పనికి రాదని ఈ శతాబ్దం చరిత్ర రుజువు చేసిందని నా అభిప్రాయం. అది ఏ విధంగా జరగగలదో అర్ధం చేసుకోవడానికి మూలాల నుండి పునరాలోచించాలని నేనూ అనుకుంటున్నాను. దీనికి జవాబు దొరుకుతుందని హామీ ఏమి లేదు. అయినప్పటికీ అన్వేషణ జరపవలసిందే.
పెట్టుబడిదారీ వ్యవస్థతో సరి పెట్టుకోవడం అంటే మానవ జీవితాన్ని అనైతిక స్థాయిలో ఉంచి వేయడమే. మనుషుల మధ్య "ఉపయోగం" అనేది తప్ప వేరే విలువలేవి లేని జీవితంలో సరిపెట్టుకోవడమే . ఇది తగదని నా అభిప్రాయం.