ఈ నాటి వరకు ఆంధ్రదేశ చరిత్ర పరిశోధన, రచనల్లో తెలంగాణప్రాంత చరిత్రకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి చరిత్రకారులు తగినంత ప్రాముఖ్యత ఇవ్వని లోటును పూడ్చడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం... శాస్త్రిగారి అడుగు జాడల్లో నడుస్తూ ఇంతవరకూ అసమగ్రంగా వున్న తెలంగాణరాజకీయ, సాంఘీక, మత, సాంస్కృతిక చరిత్రకు నిర్దిష్ట రూపకల్పన చేసిన ఘనత నారాయణరెడ్డి గార్కి దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు... సబాల్ట్రన్ చరిత్ర రచనా పద్ధతి ననుసరించి కేవలం శిష్ట వర్గాలను గురించే కాకుండా దళిత, బహుజన చరిత్రకు సంబంధించిన అంశాలను కూడా సంక్షిప్తంగా వివరించారు... నారాయణరెడ్డిగారు తను సేకరించిన నూతన సమాచారం ఆధారంగా తెలంగాణ చరిత్రలోని కొన్ని ఖాళీలను పూరించి, భావి తరాల పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచాడని చెప్పక తప్పదు మొత్తంగా ఈ పుస్తకం ద్వారా దీర్ఘకాల తెలంగాణ చరిత్రను క్రమపద్ధతిలో చదవడానికి అవకాశమేర్పడింది.
- అడపా సత్యనారాయణ
ఈ నాటి వరకు ఆంధ్రదేశ చరిత్ర పరిశోధన, రచనల్లో తెలంగాణప్రాంత చరిత్రకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి చరిత్రకారులు తగినంత ప్రాముఖ్యత ఇవ్వని లోటును పూడ్చడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం... శాస్త్రిగారి అడుగు జాడల్లో నడుస్తూ ఇంతవరకూ అసమగ్రంగా వున్న తెలంగాణరాజకీయ, సాంఘీక, మత, సాంస్కృతిక చరిత్రకు నిర్దిష్ట రూపకల్పన చేసిన ఘనత నారాయణరెడ్డి గార్కి దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు... సబాల్ట్రన్ చరిత్ర రచనా పద్ధతి ననుసరించి కేవలం శిష్ట వర్గాలను గురించే కాకుండా దళిత, బహుజన చరిత్రకు సంబంధించిన అంశాలను కూడా సంక్షిప్తంగా వివరించారు... నారాయణరెడ్డిగారు తను సేకరించిన నూతన సమాచారం ఆధారంగా తెలంగాణ చరిత్రలోని కొన్ని ఖాళీలను పూరించి, భావి తరాల పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచాడని చెప్పక తప్పదు మొత్తంగా ఈ పుస్తకం ద్వారా దీర్ఘకాల తెలంగాణ చరిత్రను క్రమపద్ధతిలో చదవడానికి అవకాశమేర్పడింది. - అడపా సత్యనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.