Title | Price | |
Cheruvu Gandi | Rs.160 | In Stock |
చెరువు గండి
స్వతంత్రం దేశం ముంగిట నిలబడి గడప లోపలికి రావాలా వద్దా అనుకుంటూ దోబూచులాడుతున్న రోజులవి. చెరువుగండి గ్రామంలో అపుడు జరిగిందో ఘటన. ఆ ఘటన జరగక ముందువరకు ఆ గ్రామం పేరు చెరువు పల్లె, ఘటన తరువాత 'చెరువు గండి'గా మారింది.
సమయం నడిజాము దాటింది. గ్రామం ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దమయితేకాదు. కాకపొతే ఎక్కడో వినవచ్చే తీతువుపిట్టలు అరుపులు, రెయిమేతగువ్వల రెక్కల చప్పుళ్ళు, గుడ్లగూబలు గుసగుసలు, నక్కల ఊళలు ఊరి ప్రశాంతతకు, ప్రజల నిద్రకు భంగం కలిగించడం లేదు. కానీ ఏదో ప్రళయం ముంచుకొస్తున్నట్లుగా, ఎవరో తట్టి లేపినట్లుగా ఊరుఊరంతా ఉలిక్కిపడి నిద్రలేచింది. ఇంటింటిలో పిడుగులు పడ్డట్లుగా డప్పుల మోత. నలుగురు డప్పులు కొట్టి దండోరా వేస్తున్నారు. "ముత్యాలమ్మ చెరువు తెగిపోతావుండాది. పార్లు, గడార్లు, పుడకలు, సంచులు, లాంతర్లు తీస్కోని ఆడోల్లు, మొగోళ్ళు చెరువు దగ్గరికి రండి.” అవే మాటలు వీధులన్నీ తిరిగి తిరిగి చెప్తున్నారు.
అరగంట సమయంలో ఊరి జనంతో పాటు, పల్లెకు కూతవేటు దూరంలో ఉండే మాదిగపల్లె జనం కూడా చెరువు దగ్గరికి చేరారు. చెరువుకింద భూమి కలిగిన రైతులు 'నీళ్ళు పొతే సేద్యం ఏమేసిదిరా సామి' అంటూ పరిగెత్తి వచ్చారు. 'సేద్యం లేకపోతే కూలేడా దొరికేన్రా దేవుడా' అంటూ కూలిజేసి బతికేటోళ్ళు వచ్చారు. అప్పటికే చెరువుకట్ట బార వెడల్పున గండిపడింది. నీళ్ళు ఉరుకులుపెడుతూ పోతున్నాయి............
చెరువు గండి స్వతంత్రం దేశం ముంగిట నిలబడి గడప లోపలికి రావాలా వద్దా అనుకుంటూ దోబూచులాడుతున్న రోజులవి. చెరువుగండి గ్రామంలో అపుడు జరిగిందో ఘటన. ఆ ఘటన జరగక ముందువరకు ఆ గ్రామం పేరు చెరువు పల్లె, ఘటన తరువాత 'చెరువు గండి'గా మారింది. సమయం నడిజాము దాటింది. గ్రామం ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దమయితేకాదు. కాకపొతే ఎక్కడో వినవచ్చే తీతువుపిట్టలు అరుపులు, రెయిమేతగువ్వల రెక్కల చప్పుళ్ళు, గుడ్లగూబలు గుసగుసలు, నక్కల ఊళలు ఊరి ప్రశాంతతకు, ప్రజల నిద్రకు భంగం కలిగించడం లేదు. కానీ ఏదో ప్రళయం ముంచుకొస్తున్నట్లుగా, ఎవరో తట్టి లేపినట్లుగా ఊరుఊరంతా ఉలిక్కిపడి నిద్రలేచింది. ఇంటింటిలో పిడుగులు పడ్డట్లుగా డప్పుల మోత. నలుగురు డప్పులు కొట్టి దండోరా వేస్తున్నారు. "ముత్యాలమ్మ చెరువు తెగిపోతావుండాది. పార్లు, గడార్లు, పుడకలు, సంచులు, లాంతర్లు తీస్కోని ఆడోల్లు, మొగోళ్ళు చెరువు దగ్గరికి రండి.” అవే మాటలు వీధులన్నీ తిరిగి తిరిగి చెప్తున్నారు. అరగంట సమయంలో ఊరి జనంతో పాటు, పల్లెకు కూతవేటు దూరంలో ఉండే మాదిగపల్లె జనం కూడా చెరువు దగ్గరికి చేరారు. చెరువుకింద భూమి కలిగిన రైతులు 'నీళ్ళు పొతే సేద్యం ఏమేసిదిరా సామి' అంటూ పరిగెత్తి వచ్చారు. 'సేద్యం లేకపోతే కూలేడా దొరికేన్రా దేవుడా' అంటూ కూలిజేసి బతికేటోళ్ళు వచ్చారు. అప్పటికే చెరువుకట్ట బార వెడల్పున గండిపడింది. నీళ్ళు ఉరుకులుపెడుతూ పోతున్నాయి............© 2017,www.logili.com All Rights Reserved.