సమాజమే ఒక పెద్ద సముద్రం.
సముద్రంలో ఎన్నో జీవరాసులున్నట్లు... సమాజంలోనూ ఎందరో మనుషులు, ఎన్నో వర్గాలు. ప్రతి వర్గమూ కొన్ని కథల్ని దాచుకోనుంటుంది. వ్యక్తుల అనుభవాల రూపంలో వుంటూ అవి తమ కథల్ని తామే చెప్పుకుంటూ వుంటాయి.
ఆకాశమంటేనే తెలీని నీళ్ళు ఆవిరై ఆకాశంలోకి ఎగిరి మబ్బుల రూపాల్ని దాల్చి, తిరిగి భూమిపైకి దూకుతాయి. చెరువుల్లో, నదుల్లో, సముద్రంలో పడినవి తిరిగి ఆవిరై ఆకాశానికి ఎగరాలని చూస్తుంటాయి. నేలపైన పడిన చినుకులు మట్టిలో ఇంకిపోయి ప్రకృతికి అందం తెచ్చే పచ్చదనానికి ప్రాణంగా నిలవాలని ఆరాటపడతాయి. అలాగే సమాజపు అడుగున పడిపోయి కనిపించకుండా పోయిన ఈ కథలూ తిరిగి ఎవరి కంఠం ద్వారానో, కలంద్వారానో తమకు తాము చెప్పుకోవడానికి ఆరాటపడుతుంటాయి.
ఇవి కేవలం జరిగిన అంశాలేకాదు, జీవుల ఆశలు, నిరాశలు, మోదాలు, భేదాలు, ఆనందాలు, ఆవేదనలు... ఇంకా ఎన్నో రహస్యాలు... జ్ఞాపకాలుగా, కథలుగా రూపుదిద్దుకుంటాయి. మనుషుల మనస్తత్వాన్ని తెలుపుతాయి. సమాజపు నిజరూపానికి చిత్రిక కడతాయి. నరుల మనసుల్లో మలినాన్ని తుడిచే ప్రయత్నం చేస్తాయి.
ప్రతి వ్యక్తి బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం... సంసారం అన్నీ కథల సమాహారాలే. అవి చదువులు, సంప్రదాయాలు, సంస్కారాల రూపాల్లో... ఎన్నో ఏండ్లప్పుడు తీసి పెట్టుకున్న పాత ఛాయాచిత్రాల్లా, గతించిన గత జన్మల జ్ఞాపకాల్లా... స్పష్టాస్పష్టంగా... పిల్లగాలి మోసుకొచ్చే పరిమళాల్లా, దుమ్ముధూళి కణాల్లా... ఊడిపడుతూనే వుంటాయి.................
కపిరి ప్రవేశిక సమాజంలో కథల వేట సమాజమే ఒక పెద్ద సముద్రం. సముద్రంలో ఎన్నో జీవరాసులున్నట్లు... సమాజంలోనూ ఎందరో మనుషులు, ఎన్నో వర్గాలు. ప్రతి వర్గమూ కొన్ని కథల్ని దాచుకోనుంటుంది. వ్యక్తుల అనుభవాల రూపంలో వుంటూ అవి తమ కథల్ని తామే చెప్పుకుంటూ వుంటాయి. ఆకాశమంటేనే తెలీని నీళ్ళు ఆవిరై ఆకాశంలోకి ఎగిరి మబ్బుల రూపాల్ని దాల్చి, తిరిగి భూమిపైకి దూకుతాయి. చెరువుల్లో, నదుల్లో, సముద్రంలో పడినవి తిరిగి ఆవిరై ఆకాశానికి ఎగరాలని చూస్తుంటాయి. నేలపైన పడిన చినుకులు మట్టిలో ఇంకిపోయి ప్రకృతికి అందం తెచ్చే పచ్చదనానికి ప్రాణంగా నిలవాలని ఆరాటపడతాయి. అలాగే సమాజపు అడుగున పడిపోయి కనిపించకుండా పోయిన ఈ కథలూ తిరిగి ఎవరి కంఠం ద్వారానో, కలంద్వారానో తమకు తాము చెప్పుకోవడానికి ఆరాటపడుతుంటాయి. ఇవి కేవలం జరిగిన అంశాలేకాదు, జీవుల ఆశలు, నిరాశలు, మోదాలు, భేదాలు, ఆనందాలు, ఆవేదనలు... ఇంకా ఎన్నో రహస్యాలు... జ్ఞాపకాలుగా, కథలుగా రూపుదిద్దుకుంటాయి. మనుషుల మనస్తత్వాన్ని తెలుపుతాయి. సమాజపు నిజరూపానికి చిత్రిక కడతాయి. నరుల మనసుల్లో మలినాన్ని తుడిచే ప్రయత్నం చేస్తాయి. ప్రతి వ్యక్తి బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం... సంసారం అన్నీ కథల సమాహారాలే. అవి చదువులు, సంప్రదాయాలు, సంస్కారాల రూపాల్లో... ఎన్నో ఏండ్లప్పుడు తీసి పెట్టుకున్న పాత ఛాయాచిత్రాల్లా, గతించిన గత జన్మల జ్ఞాపకాల్లా... స్పష్టాస్పష్టంగా... పిల్లగాలి మోసుకొచ్చే పరిమళాల్లా, దుమ్ముధూళి కణాల్లా... ఊడిపడుతూనే వుంటాయి.................© 2017,www.logili.com All Rights Reserved.