రాజకీయ శ్రీనీడల్లో రక్తచందనం
'లక్షల కోట్లు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసి విదేశాలకు దొబ్బేసిన పెద్దపెద్ద దొంగలే దర్జాగా జీవిస్తున్నారు. గవర్నమెంటు భూముల్ని కబ్జాలుచేసి, ఇసకను, ఇతర గనులను త్యారగా తీసుకుని, పెద్దపెద్ద కొండల్ని సైతం నుగ్గు నుగ్గుచేసి అమ్ము కొని సొమ్ము చేసుకుని కోట్లకు పడగలెత్తే నిజమైన దొంగలు, రాజకీయం ముసుగే సుకుని, అధికారపీఠాలధిరోహించి చీకూచింతా లేకుండా జీవిస్తావుండారు. కానీ బతుకుతెరువు కోసరం అడవులపైన ఆధారపడి కడుపు నింపుకునే అమాయకులే అన్యాయంగా బలైపోతా వుండారు'... సుమారు అర్ధశతాబ్ది కాలంగా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతూనేవున్న ఎర్రచందనం దుంగల దొంగరవాణాలో పాలుపంచుకునే కూలీలపై విధినిర్వహణలో భాగంగా తాను జరిపిన కాల్పులకు అభంశుభం తెలియని అమాయక యానాది యువకుడు బలైపోతే అందుకు పశ్చాత్తాపపడే ఒక కానిస్టేబుల్ అంతరంగమథనం ఇది... రాజకీయ రంగులు పులుముకున్న ఈ తతంగం మొత్తం వెనుకవున్న డొల్లతనం ఈ నేపథ్యంలో మనకు కనిపిస్తుంది. రాజకీయనేతల ఎడతెగని స్వార్థం, అత్యాశలు కలగలిసి ఈ నేపథ్యంలోని ఎర్రచందనాన్ని రక్తచందనంగా మార్చేస్తోంది. అడవితల్లి సాక్షిగా ఈ రక్తచందనం ప్రహసనంలో బాధాసర్పదష్టులై పోతున్న పేదల బతుకులెన్నెన్నో, రాజకీయ వ్యవస్థ, అది సృష్టించే ఏజెంట్ల వ్యవస్థ అధికార వ్యవస్థనూ, పోలీసు వ్యవస్థనూ ఎంతగా గుప్పట్లో పెట్టుకుని ఈ దుంగల అక్రమ రవాణా రాష్ట్ర, దేశ హద్దులు దాటి ఎంత యథేచ్ఛగా సాగేలా చేస్తాయో పేర్కొంటూ వాటి వెనుక వున్న పన్నాగాలకూ, ప్రయాసలకూ అక్షరరూపమిచ్చి డా॥ వి.ఆర్. రాసాని తాజాగా వెలువరించిన నవల 'రక్తచందనం'. ఎర్రచందనం ప్రధాన వస్తువుగా తొలిసారిగా ఈ రచయిత గతంలో 'నిప్పు' అనే కథను వెలువరించారు.
ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని విధంగా ఎర్ర బంగారంగా పిలువబడే అపురూప ఎర్రచందనం సంపద చిత్తూరు జిల్లాలోని శేషాచలం, తలకోన, నేరబైలు అడవుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్నిసార్లు దుంగల్ని పట్టుకుంటున్నా ఈ సంపద విలువ తెలిసినప్పటినుంచీ ఈ ఎర్రచందనం అక్రమ రవాణా ఒక నిరంతర ప్రక్రియగా సాగిపోతూనేవుంది. ఇందుకు ప్రధాన కారణం ప్రక్క రాష్ట్రమైన తమిళనాడునుంచి ఆ రాష్ట్రాన్ని ఒకప్పుడు గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గ్యాంగులో తర్ఫీదు పొంది నదిలా ఇక్కడికి ప్రవహించే కూలీల వ్యవస్థను ఇక్కడి రాజకీయ వ్యవస్థ తనకనుకూలంగా మలచుకొని వారి ద్వారా లబ్ధి పొందడమే. ఈ దుంగల అక్రమ రవాణాను నిరంతరం అడ్డుకుంటూనే వున్నా అది ఎందుకు ఇంకా యథేచ్ఛగా సాగుతూనే వుందనే ప్రశ్నకు ఈ నవల సమాధానం............................
రాజకీయ శ్రీనీడల్లో రక్తచందనం 'లక్షల కోట్లు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసి విదేశాలకు దొబ్బేసిన పెద్దపెద్ద దొంగలే దర్జాగా జీవిస్తున్నారు. గవర్నమెంటు భూముల్ని కబ్జాలుచేసి, ఇసకను, ఇతర గనులను త్యారగా తీసుకుని, పెద్దపెద్ద కొండల్ని సైతం నుగ్గు నుగ్గుచేసి అమ్ము కొని సొమ్ము చేసుకుని కోట్లకు పడగలెత్తే నిజమైన దొంగలు, రాజకీయం ముసుగే సుకుని, అధికారపీఠాలధిరోహించి చీకూచింతా లేకుండా జీవిస్తావుండారు. కానీ బతుకుతెరువు కోసరం అడవులపైన ఆధారపడి కడుపు నింపుకునే అమాయకులే అన్యాయంగా బలైపోతా వుండారు'... సుమారు అర్ధశతాబ్ది కాలంగా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతూనేవున్న ఎర్రచందనం దుంగల దొంగరవాణాలో పాలుపంచుకునే కూలీలపై విధినిర్వహణలో భాగంగా తాను జరిపిన కాల్పులకు అభంశుభం తెలియని అమాయక యానాది యువకుడు బలైపోతే అందుకు పశ్చాత్తాపపడే ఒక కానిస్టేబుల్ అంతరంగమథనం ఇది... రాజకీయ రంగులు పులుముకున్న ఈ తతంగం మొత్తం వెనుకవున్న డొల్లతనం ఈ నేపథ్యంలో మనకు కనిపిస్తుంది. రాజకీయనేతల ఎడతెగని స్వార్థం, అత్యాశలు కలగలిసి ఈ నేపథ్యంలోని ఎర్రచందనాన్ని రక్తచందనంగా మార్చేస్తోంది. అడవితల్లి సాక్షిగా ఈ రక్తచందనం ప్రహసనంలో బాధాసర్పదష్టులై పోతున్న పేదల బతుకులెన్నెన్నో, రాజకీయ వ్యవస్థ, అది సృష్టించే ఏజెంట్ల వ్యవస్థ అధికార వ్యవస్థనూ, పోలీసు వ్యవస్థనూ ఎంతగా గుప్పట్లో పెట్టుకుని ఈ దుంగల అక్రమ రవాణా రాష్ట్ర, దేశ హద్దులు దాటి ఎంత యథేచ్ఛగా సాగేలా చేస్తాయో పేర్కొంటూ వాటి వెనుక వున్న పన్నాగాలకూ, ప్రయాసలకూ అక్షరరూపమిచ్చి డా॥ వి.ఆర్. రాసాని తాజాగా వెలువరించిన నవల 'రక్తచందనం'. ఎర్రచందనం ప్రధాన వస్తువుగా తొలిసారిగా ఈ రచయిత గతంలో 'నిప్పు' అనే కథను వెలువరించారు. ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని విధంగా ఎర్ర బంగారంగా పిలువబడే అపురూప ఎర్రచందనం సంపద చిత్తూరు జిల్లాలోని శేషాచలం, తలకోన, నేరబైలు అడవుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్నిసార్లు దుంగల్ని పట్టుకుంటున్నా ఈ సంపద విలువ తెలిసినప్పటినుంచీ ఈ ఎర్రచందనం అక్రమ రవాణా ఒక నిరంతర ప్రక్రియగా సాగిపోతూనేవుంది. ఇందుకు ప్రధాన కారణం ప్రక్క రాష్ట్రమైన తమిళనాడునుంచి ఆ రాష్ట్రాన్ని ఒకప్పుడు గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గ్యాంగులో తర్ఫీదు పొంది నదిలా ఇక్కడికి ప్రవహించే కూలీల వ్యవస్థను ఇక్కడి రాజకీయ వ్యవస్థ తనకనుకూలంగా మలచుకొని వారి ద్వారా లబ్ధి పొందడమే. ఈ దుంగల అక్రమ రవాణాను నిరంతరం అడ్డుకుంటూనే వున్నా అది ఎందుకు ఇంకా యథేచ్ఛగా సాగుతూనే వుందనే ప్రశ్నకు ఈ నవల సమాధానం............................© 2017,www.logili.com All Rights Reserved.