శ్రీ తాళ్లూరి లాబన్ బాబు రచించిన వచన కావ్యం 'వాయుగానం' అత్యంత నూత్న కావ్యం.
ఇది అందరూ వ్రాసే వచన కావ్యం వంటిది కాదు. దీని పంధాయే నూత్నం. విషయమే నూత్నం. విశ్లేషణమే నూత్నం. ఆధునిక సాహిత్యంలో ఇది అతి నూత్న కావ్యం.
ఇది చరిత్ర మానవ పరిణామం వివరిస్తుంది. ప్రపంచ దేశాల స్థితిగతులు, పరిస్థితులు తెలిపింది.
ఇది విజ్ఞాన శాస్త్రం. మనిషి నిర్మించిన, గ్రహించిన, పరిశోధించిన, సాధించిన శాస్త్ర విజ్ఞాన ఫలితాల ప్రపంచనం ఇందులో పొందు పరచబడింది.
ఇది ఖగోళశాస్త్రం. ఆకాశంలోని గ్రహాలు, వాటి తత్త్వం, స్వరూప స్వభావాలు, సౌందర్యాదిక విశేషాలు అద్భుతంగా సమీక్షించింది.
ప్రపంచంలోని అందాలను, ఆత్మీయంగా పరమ రమణీయంగా కవి సహృదయ పాఠకులకు సందర్శింప చేశాడు.
గ్రాంధిక వ్యావహారిక మాండలిక భాషా రూపాలను అలవోక సమ్మిళితం చేసి, నూత్న పద కల్పనలతో సాహిత్య సౌందర్యం ద్విగుణీకృతం చేశాడు. ముష్క ముదితలు, పుంబోడులు (లేస్బియన్లు), పురీష పుంగవులు (గేలు), బొందికంటి (ఇంద్రుడు) వంటి అనేక అద్భుత పదబంధాలు కల్పించాడు.
అష్టగ్రహాల ప్రయాణంలో ప్రపంచ పటం చూపించాడు. ప్రపంచంలోని ఏ విశేషమూ చెప్పకుండా విడిచి పెట్టలేదు.
వృక్షాలను పెంచి పోషించు సుజనులు వాయు కాలుష్య నివారణకు కృషి సల్పు పర్యావరణ పరిరక్షణ దీక్షాపరులు, క్షితిపై మొక్కలు నాటి అక్షయంగా పచ్చదనం కాపాడుతున్న కృషి జనులు, భూతాప నివారణకు పాటుపడుతున్న శాస్త్రవేత్తలు స్వచ్చంద సంస్థలు ప్రభుత్వాలు ఎందరో మహానుభావులు కృషి చేస్తున్నారు. ఇంకా ఎందరో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారని ఆశిసున్నాం.
- తాళ్లూరి లాబన్ బాబు
శ్రీ తాళ్లూరి లాబన్ బాబు రచించిన వచన కావ్యం 'వాయుగానం' అత్యంత నూత్న కావ్యం. ఇది అందరూ వ్రాసే వచన కావ్యం వంటిది కాదు. దీని పంధాయే నూత్నం. విషయమే నూత్నం. విశ్లేషణమే నూత్నం. ఆధునిక సాహిత్యంలో ఇది అతి నూత్న కావ్యం. ఇది చరిత్ర మానవ పరిణామం వివరిస్తుంది. ప్రపంచ దేశాల స్థితిగతులు, పరిస్థితులు తెలిపింది. ఇది విజ్ఞాన శాస్త్రం. మనిషి నిర్మించిన, గ్రహించిన, పరిశోధించిన, సాధించిన శాస్త్ర విజ్ఞాన ఫలితాల ప్రపంచనం ఇందులో పొందు పరచబడింది. ఇది ఖగోళశాస్త్రం. ఆకాశంలోని గ్రహాలు, వాటి తత్త్వం, స్వరూప స్వభావాలు, సౌందర్యాదిక విశేషాలు అద్భుతంగా సమీక్షించింది. ప్రపంచంలోని అందాలను, ఆత్మీయంగా పరమ రమణీయంగా కవి సహృదయ పాఠకులకు సందర్శింప చేశాడు. గ్రాంధిక వ్యావహారిక మాండలిక భాషా రూపాలను అలవోక సమ్మిళితం చేసి, నూత్న పద కల్పనలతో సాహిత్య సౌందర్యం ద్విగుణీకృతం చేశాడు. ముష్క ముదితలు, పుంబోడులు (లేస్బియన్లు), పురీష పుంగవులు (గేలు), బొందికంటి (ఇంద్రుడు) వంటి అనేక అద్భుత పదబంధాలు కల్పించాడు. అష్టగ్రహాల ప్రయాణంలో ప్రపంచ పటం చూపించాడు. ప్రపంచంలోని ఏ విశేషమూ చెప్పకుండా విడిచి పెట్టలేదు. వృక్షాలను పెంచి పోషించు సుజనులు వాయు కాలుష్య నివారణకు కృషి సల్పు పర్యావరణ పరిరక్షణ దీక్షాపరులు, క్షితిపై మొక్కలు నాటి అక్షయంగా పచ్చదనం కాపాడుతున్న కృషి జనులు, భూతాప నివారణకు పాటుపడుతున్న శాస్త్రవేత్తలు స్వచ్చంద సంస్థలు ప్రభుత్వాలు ఎందరో మహానుభావులు కృషి చేస్తున్నారు. ఇంకా ఎందరో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారని ఆశిసున్నాం. - తాళ్లూరి లాబన్ బాబు
© 2017,www.logili.com All Rights Reserved.