శబ్దాలకి అర్థాలని తెలిపే గ్రంథాలనే నిఘంటువులంటారు. వీటికి కోశము, అనుశాసనం, అభిధానం అనేవి పర్యాయపదాలు. వీటన్నిటిలోకి నిఘంటువు అన్న పదమే ప్రాచీనమైనదిగా కనిపిస్తుంది. లౌకికంగా మనం నిత్యం ఉపయోగించే పదాలు, సాహిత్యంలో ఉపయోగించే పదాలు వాటి అర్థాలని ఈ నిఘంటువులు మనకి వివరిస్తాయి. పూర్వకాలంలో చాలావరకు నిఘంటువులన్నీ పద్యాలరూపంలో ఉండేవి. కొన్ని బాగా ప్రసిద్ది పొందాయి. తెలుగు వచన నిఘంటువులు కూడా చాలా ప్రాముఖ్యాన్ని పొందాయి. ఇక అకారాది క్రమంలో తెలుగులో రూపొందిన నిఘంటువులలో మొదటిది ఆంధ్రదీపిక. దీని రచయిత వెంకటార్యుడు. కీ.శ.1816లో ఇది ప్రచురించబడింది. ఇలా నిఘ౦టువులకి ఎ౦తో ప్రాశస్త్యం వుంది.
'దేశాన్నైనా చూడు కోశాన్నైనా చూడు' అని లోకిక్తి. నిఘంటువుల్ని గనక చదివితే విద్యార్థులకి ఎంతో విజ్ఞానం లభిస్తుంది. ఒక పదానికి వివిధ అర్థాల్ని వాటి విశేషాలతో సహా తెలియజేసే శబ్దరత్నాకరం, శబ్దర్థచంద్రిక వంటి పెద్ద నిఘంటువులు ప్రస్తుతం మనకి విరివిగా లభిస్తున్నారు. అందుకే విద్యార్థులకి అనుగుణంగా సులభశైలిలో ఉండే విద్యార్థి నిఘంటువుని వ్యవహార భాషలో కేవలం పదం దానికి సంబంధించిన ముఖ్యమైన అర్థాలతో రూపొందించాము. పదసంపద పెంపొంది౦చుకోవాలనే విద్యార్థులకి ఈ నిఘంటువు కరదీపికలా ఉపయోగపడుతుంది.
- డా. జయంతి చక్రవర్తి
శబ్దాలకి అర్థాలని తెలిపే గ్రంథాలనే నిఘంటువులంటారు. వీటికి కోశము, అనుశాసనం, అభిధానం అనేవి పర్యాయపదాలు. వీటన్నిటిలోకి నిఘంటువు అన్న పదమే ప్రాచీనమైనదిగా కనిపిస్తుంది. లౌకికంగా మనం నిత్యం ఉపయోగించే పదాలు, సాహిత్యంలో ఉపయోగించే పదాలు వాటి అర్థాలని ఈ నిఘంటువులు మనకి వివరిస్తాయి. పూర్వకాలంలో చాలావరకు నిఘంటువులన్నీ పద్యాలరూపంలో ఉండేవి. కొన్ని బాగా ప్రసిద్ది పొందాయి. తెలుగు వచన నిఘంటువులు కూడా చాలా ప్రాముఖ్యాన్ని పొందాయి. ఇక అకారాది క్రమంలో తెలుగులో రూపొందిన నిఘంటువులలో మొదటిది ఆంధ్రదీపిక. దీని రచయిత వెంకటార్యుడు. కీ.శ.1816లో ఇది ప్రచురించబడింది. ఇలా నిఘ౦టువులకి ఎ౦తో ప్రాశస్త్యం వుంది. 'దేశాన్నైనా చూడు కోశాన్నైనా చూడు' అని లోకిక్తి. నిఘంటువుల్ని గనక చదివితే విద్యార్థులకి ఎంతో విజ్ఞానం లభిస్తుంది. ఒక పదానికి వివిధ అర్థాల్ని వాటి విశేషాలతో సహా తెలియజేసే శబ్దరత్నాకరం, శబ్దర్థచంద్రిక వంటి పెద్ద నిఘంటువులు ప్రస్తుతం మనకి విరివిగా లభిస్తున్నారు. అందుకే విద్యార్థులకి అనుగుణంగా సులభశైలిలో ఉండే విద్యార్థి నిఘంటువుని వ్యవహార భాషలో కేవలం పదం దానికి సంబంధించిన ముఖ్యమైన అర్థాలతో రూపొందించాము. పదసంపద పెంపొంది౦చుకోవాలనే విద్యార్థులకి ఈ నిఘంటువు కరదీపికలా ఉపయోగపడుతుంది. - డా. జయంతి చక్రవర్తి© 2017,www.logili.com All Rights Reserved.