తరతరాలుగా సామాజిక సంపదలోనూ, ఉత్పత్తిలోనూ సరిపడినంత వాటాకు గానీ, విద్యాగంధానికి గానీ నోచుకోకుండా వివక్షకు, అణచివేతకు గురైన దళిత, గిరిజన ప్రజానీకపు ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసి, వారి సామాజికస్థాయి పెంపుకూ, అభివృద్ధికీ దారి తీసేట్లుగా రూపొందించిన ఈ చట్టం వారికి ఎంతో ప్రయోజనకారి. ఈ చట్టాన్నీ దీనికి అనుబంధంగా తయారు చేసిన నిబంధనలనూ మరింత ఉపయోగకరంగా సవరించిన తాజా చట్టాన్ని 2016 నుంచి అమలులోకి తెచ్చారు. దేశ జనాభాలో వరుసగా 16 శాతం, 7 శాతం ఉన్న ఎస్ సి, ఎస్ టి ల సమాన హక్కుల సాధనలో ఈ చట్టం న్యాయకేతనంగా నిలుస్తుంది.
ఎన్ని చట్టాలున్నా ఆశించిన స్థాయిలో దళితుల సామాజిక, ఆర్ధిక స్థితిగతులలోను, దళితులపై ఉన్న భూస్వామ్య కులాధిపత్య ధోరణిలోనూ తగినంత మార్పు రాలేదనేది కాదనలేని సత్యం. మొన్నటి ఖైర్లాంజీ, కారంచేడు, నిన్నటి చుండూరు, నేడు గుజరాత్, అమలాపురం, సూదాపురం, బాలకొండ ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయి.
తరతరాలుగా సామాజిక సంపదలోనూ, ఉత్పత్తిలోనూ సరిపడినంత వాటాకు గానీ, విద్యాగంధానికి గానీ నోచుకోకుండా వివక్షకు, అణచివేతకు గురైన దళిత, గిరిజన ప్రజానీకపు ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసి, వారి సామాజికస్థాయి పెంపుకూ, అభివృద్ధికీ దారి తీసేట్లుగా రూపొందించిన ఈ చట్టం వారికి ఎంతో ప్రయోజనకారి. ఈ చట్టాన్నీ దీనికి అనుబంధంగా తయారు చేసిన నిబంధనలనూ మరింత ఉపయోగకరంగా సవరించిన తాజా చట్టాన్ని 2016 నుంచి అమలులోకి తెచ్చారు. దేశ జనాభాలో వరుసగా 16 శాతం, 7 శాతం ఉన్న ఎస్ సి, ఎస్ టి ల సమాన హక్కుల సాధనలో ఈ చట్టం న్యాయకేతనంగా నిలుస్తుంది. ఎన్ని చట్టాలున్నా ఆశించిన స్థాయిలో దళితుల సామాజిక, ఆర్ధిక స్థితిగతులలోను, దళితులపై ఉన్న భూస్వామ్య కులాధిపత్య ధోరణిలోనూ తగినంత మార్పు రాలేదనేది కాదనలేని సత్యం. మొన్నటి ఖైర్లాంజీ, కారంచేడు, నిన్నటి చుండూరు, నేడు గుజరాత్, అమలాపురం, సూదాపురం, బాలకొండ ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.