పద్మ పురాణములోని ప్రస్తుతం రెండు భాగాలు. అందులో భూమి ఖండము, స్వర్గ ఖండము, సృష్టి ఖండము ఉన్నవి.
సృష్టి ఖండము పద్మ పురాణములో మొదటి ఖండము. సృష్టి, ఆ సృష్టిలో అనేక జీవరాశులు. ఆ జీవులలో నేను ఎందుకు సృష్టింపబడ్డాను. ఈ సృష్టికి మూలము ఏమిటి? మనకి ఎందుకు ఈ కష్ట సుఖములు కలుగుతున్నవి? వంటి ప్రశ్నలకు సమాధానము తెలుసుకోవలెనన్న కుతూహలము/ జిజ్ఞాస ఉన్నది కేవలము మానవులకు మాత్రమే. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జంతువు కానీ పక్షి కానీ, చెట్టు కానీ, ఇతర జీవులు కానీ అటువంటి ప్రశ్న వేయడం చూసారా? లేదు. ఎందుకంటే అది జరిగే పనికాదు. మానవుల వలెనే పశువులకు కూడా బుద్ధి ఉన్నది.
అనేక ప్రయోగముల ద్వారా ఈ విషయమును నిరూపించారు కూడా. కానీ మానవులకు మాత్రమే జిజ్ఞాస ఎందుకు కలుగుతుంది అనే విషయముపై శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేశారు, చేస్తున్నారు. కానీ దీని పై ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. మానవ జన్మ దుర్లభమైనది. ఆలోచన, జిజ్ఞాస, కార్యాకార్యవిచక్షణ ఉన్నది కేవలము మానవులకు మాత్రమే. మానవుడు గమ్యమును నిర్ణయించుకొని దానిని చేరుటకు ప్రయత్నించుకోగలడు.
భూమి రెండవ ఖండము. ఈ భూమిపై ఆచరింప వలసిన ధర్మములు, ఆ ధర్మములను ఆచరించిన వారి చరిత్రలు, ఆ ధర్మములకు ఫలితములు ఇందులో చెప్పబడినవి. ముఖ్యముగా శుక్ల చరిత్రలో మనము తెలుసుకోవలసిన ఎన్నో విషయములు చెప్పబడినవి. అలాగే మనము తినే ఆహారము శరీరములోకి వెళ్ళిన తరువాత ఏమి జరుగుతుంది. మనము గర్భములో ప్రవేశించిన తరువాత ఏమి జరుగుతుంది. సైన్సు చెప్పని ఎన్నో విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో చెప్పబడ్డాయి.
స్వర్గ ఖండము మూడవ ఖండము. స్వర్గఖండంలో ముఖ్యముగా తీర్థములు వివరించబడ్డాయి. స్వర్గమును ప్రసాదించు పుణ్యమునకు కారణమైన తీర్థములు వర్ణించబడినందున ఈ ఖండమునకు స్వర్గ ఖండమని పేరు. ఈ ఖండములో భూలోకములో ఉన్న వివిధ తీర్థములు, అచట ఆచరించవలసిన కర్మలు, విధులు ఇందులో వర్ణించబడ్డాయి.
పద్మ పురాణములోని ప్రస్తుతం రెండు భాగాలు. అందులో భూమి ఖండము, స్వర్గ ఖండము, సృష్టి ఖండము ఉన్నవి. సృష్టి ఖండము పద్మ పురాణములో మొదటి ఖండము. సృష్టి, ఆ సృష్టిలో అనేక జీవరాశులు. ఆ జీవులలో నేను ఎందుకు సృష్టింపబడ్డాను. ఈ సృష్టికి మూలము ఏమిటి? మనకి ఎందుకు ఈ కష్ట సుఖములు కలుగుతున్నవి? వంటి ప్రశ్నలకు సమాధానము తెలుసుకోవలెనన్న కుతూహలము/ జిజ్ఞాస ఉన్నది కేవలము మానవులకు మాత్రమే. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జంతువు కానీ పక్షి కానీ, చెట్టు కానీ, ఇతర జీవులు కానీ అటువంటి ప్రశ్న వేయడం చూసారా? లేదు. ఎందుకంటే అది జరిగే పనికాదు. మానవుల వలెనే పశువులకు కూడా బుద్ధి ఉన్నది. అనేక ప్రయోగముల ద్వారా ఈ విషయమును నిరూపించారు కూడా. కానీ మానవులకు మాత్రమే జిజ్ఞాస ఎందుకు కలుగుతుంది అనే విషయముపై శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేశారు, చేస్తున్నారు. కానీ దీని పై ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. మానవ జన్మ దుర్లభమైనది. ఆలోచన, జిజ్ఞాస, కార్యాకార్యవిచక్షణ ఉన్నది కేవలము మానవులకు మాత్రమే. మానవుడు గమ్యమును నిర్ణయించుకొని దానిని చేరుటకు ప్రయత్నించుకోగలడు. భూమి రెండవ ఖండము. ఈ భూమిపై ఆచరింప వలసిన ధర్మములు, ఆ ధర్మములను ఆచరించిన వారి చరిత్రలు, ఆ ధర్మములకు ఫలితములు ఇందులో చెప్పబడినవి. ముఖ్యముగా శుక్ల చరిత్రలో మనము తెలుసుకోవలసిన ఎన్నో విషయములు చెప్పబడినవి. అలాగే మనము తినే ఆహారము శరీరములోకి వెళ్ళిన తరువాత ఏమి జరుగుతుంది. మనము గర్భములో ప్రవేశించిన తరువాత ఏమి జరుగుతుంది. సైన్సు చెప్పని ఎన్నో విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో చెప్పబడ్డాయి. స్వర్గ ఖండము మూడవ ఖండము. స్వర్గఖండంలో ముఖ్యముగా తీర్థములు వివరించబడ్డాయి. స్వర్గమును ప్రసాదించు పుణ్యమునకు కారణమైన తీర్థములు వర్ణించబడినందున ఈ ఖండమునకు స్వర్గ ఖండమని పేరు. ఈ ఖండములో భూలోకములో ఉన్న వివిధ తీర్థములు, అచట ఆచరించవలసిన కర్మలు, విధులు ఇందులో వర్ణించబడ్డాయి.is this full padma puranam or is there any other volume?
© 2017,www.logili.com All Rights Reserved.