విశ్వం...
విశ్వం ఆకారం, పరిమాణం విస్మయాన్ని కలిగిస్తుంది. దాని పరిమాణాన్ని గురించి ఊహించేందుకు మనం దాన్ని భూమితో పోల్చవలసి ఉంటుంది. మనం నివసించే భూమి విశాలమైనప్పటికీ అదో సౌర వ్యవస్థలో ఓ స్వల్ప భాగమే. సౌర వ్యవస్థలో చాలా గ్రహాలూ, ఉపగ్రహాలు, తోక చుక్కలాంటివి ఉన్నాయి. దానివల్ల సౌరవ్యవస్థ చాలా విశాలమైనదిగా కనిపించినా, అది పాల పుంతలో స్వల్పభాగమే. పాలపుంతలో ఇలాంటి అసంఖ్యాకమైన సౌరవ్యవస్థలున్నాయి. ఈ విశ్వంలో ఇలాంటి లక్షలాది పాల పుంతలున్నాయి. దీని ఫలితంగా మనకు గోచరమయ్యే విశ్వం చాలా విశాలమైనందువల్ల దాని ఆకారాన్ని పరిమాణాన్ని ఊహించటం దుస్సాధ్యం. ఈ విశ్వావిర్భావాన్ని గురించి చాలా సిద్ధాంతాలున్నాయి.
ఓ సిద్ధాంతం ప్రకారం విశ్వారంభంలో విశ్వానికి సంబంధించిన మొత్తం పదార్ధం మండే గోళంలా ఉండేది. ఒకానొక సమయంలో ఓ పెద్ద విస్పోటనం సంభవించటంలో ఈ పెద్ద గోళపు పదార్ధం అన్ని దిక్కులకు చెదిరిపోయింది. ఇలా చెదిరిపోయిన భాగాలు చల్లబడటం పాలపుంతల ఆవిర్భావానికి కారణమైంది. ఈ పాలపుంతల పదార్ధం నిరంతరం విస్తరిస్తోంది. ఇదంతా ఇరవై మిలియన్ ల సంవత్సరాలకు పూర్వం సంభవించింది. ఈ వ్యాప్తి ఇలా కొనసాగితే ఈ విశ్వం ఖాళీ అయిపోతుంది. అయినప్పటికీ మరో సిద్ధాంతం ప్రకారం గురుత్వాకర్షణ శక్తివల్ల ఈ పాలపుంతల విస్తరణ నిలిచిపోయి, అవి సంకోచం చెందటం ప్రారంభమయ్యే సమయం ఆసన్నమౌతుంది. ఈ సిద్ధాంతం చలించే విశ్వాన్ని సూచిస్తుంది.
మూడవ సిద్ధాంతం ప్రకారం కొత్త పాలపుంతలు నిరంతరం రూపొందుతున్నాయి. పాత పాలపుంతల పదార్ధం చెదరగొట్టబడుతూ ఉంటుంది. ఈ సిద్ధాంతాలలో ఏది ప్రామాణికమో చెప్పటం కష్టం. అయినప్పటికీ, విశ్వావిర్భావం, ఉనికిని గురించి సరియైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించేందుకు విస్తారమైన పరిశోధన కొనసాగుతూనే ఉంది. ఇలా ఈ పుస్తకంలో భూమి, చరిత్ర, మానవ శరీరం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ప్రదేశాలను కనుగోనటం మొదలగు వాటి గురించి కలవు.
విశ్వం... విశ్వం ఆకారం, పరిమాణం విస్మయాన్ని కలిగిస్తుంది. దాని పరిమాణాన్ని గురించి ఊహించేందుకు మనం దాన్ని భూమితో పోల్చవలసి ఉంటుంది. మనం నివసించే భూమి విశాలమైనప్పటికీ అదో సౌర వ్యవస్థలో ఓ స్వల్ప భాగమే. సౌర వ్యవస్థలో చాలా గ్రహాలూ, ఉపగ్రహాలు, తోక చుక్కలాంటివి ఉన్నాయి. దానివల్ల సౌరవ్యవస్థ చాలా విశాలమైనదిగా కనిపించినా, అది పాల పుంతలో స్వల్పభాగమే. పాలపుంతలో ఇలాంటి అసంఖ్యాకమైన సౌరవ్యవస్థలున్నాయి. ఈ విశ్వంలో ఇలాంటి లక్షలాది పాల పుంతలున్నాయి. దీని ఫలితంగా మనకు గోచరమయ్యే విశ్వం చాలా విశాలమైనందువల్ల దాని ఆకారాన్ని పరిమాణాన్ని ఊహించటం దుస్సాధ్యం. ఈ విశ్వావిర్భావాన్ని గురించి చాలా సిద్ధాంతాలున్నాయి. ఓ సిద్ధాంతం ప్రకారం విశ్వారంభంలో విశ్వానికి సంబంధించిన మొత్తం పదార్ధం మండే గోళంలా ఉండేది. ఒకానొక సమయంలో ఓ పెద్ద విస్పోటనం సంభవించటంలో ఈ పెద్ద గోళపు పదార్ధం అన్ని దిక్కులకు చెదిరిపోయింది. ఇలా చెదిరిపోయిన భాగాలు చల్లబడటం పాలపుంతల ఆవిర్భావానికి కారణమైంది. ఈ పాలపుంతల పదార్ధం నిరంతరం విస్తరిస్తోంది. ఇదంతా ఇరవై మిలియన్ ల సంవత్సరాలకు పూర్వం సంభవించింది. ఈ వ్యాప్తి ఇలా కొనసాగితే ఈ విశ్వం ఖాళీ అయిపోతుంది. అయినప్పటికీ మరో సిద్ధాంతం ప్రకారం గురుత్వాకర్షణ శక్తివల్ల ఈ పాలపుంతల విస్తరణ నిలిచిపోయి, అవి సంకోచం చెందటం ప్రారంభమయ్యే సమయం ఆసన్నమౌతుంది. ఈ సిద్ధాంతం చలించే విశ్వాన్ని సూచిస్తుంది. మూడవ సిద్ధాంతం ప్రకారం కొత్త పాలపుంతలు నిరంతరం రూపొందుతున్నాయి. పాత పాలపుంతల పదార్ధం చెదరగొట్టబడుతూ ఉంటుంది. ఈ సిద్ధాంతాలలో ఏది ప్రామాణికమో చెప్పటం కష్టం. అయినప్పటికీ, విశ్వావిర్భావం, ఉనికిని గురించి సరియైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించేందుకు విస్తారమైన పరిశోధన కొనసాగుతూనే ఉంది. ఇలా ఈ పుస్తకంలో భూమి, చరిత్ర, మానవ శరీరం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ప్రదేశాలను కనుగోనటం మొదలగు వాటి గురించి కలవు.© 2017,www.logili.com All Rights Reserved.