"మనిషి తన మొత్తం జీవిత కాలం ఆనందంగా గడపడం ఎలా సాధ్యమౌతుంది?" అని ఎదో మాటల సందర్భంలో నేను పౌత్రతో అన్నప్పుడు ఆయన "ఏ ఒకటో మనిషి జీవితకాలపు ఆనందానికి సరిపోదు. అన్నీ కావాలి. అన్ని వయసులో అన్నింటా సంతోషంగా ఉండే వ్యక్తి మాత్రమే ఆనందమైన జీవితం గడపగలుగుతాడు." అని చెప్పారు. ఇంకా "బాల్యంలో, కౌమారంలో, యవ్వనంలో, నడివయసులో, వృద్ధాప్యంలో, విద్యార్థిగా, ఉద్యోగిగా, భార్యాభర్తలుగా, స్నేహితులుగా, ప్రేమికులుగా, ఇలా అన్ని దశల్లో అన్ని పాత్రలలోనూ ఒక వ్యక్తి సంతోషంగా జీవించాలనే తపనతో ఉంటే అతడు ప్రవర్తించే విధానమే జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది. ఒక సంపూర్ణ సంతృప్తికర జీవితమే అందమైన జీవితం" అన్నారు.
చాలా బాగుంది. ఈ కాన్సెప్టుతో "మీరెందుకు పుస్తకం వ్రాయకూడదు? విజయం వెంట పరుగులెత్తించగల పుస్తకాలు చాలా ఉన్నాయి. కానీ జీవితాన్ని అందంగా మలుచుకోగల పుస్తకాలు లేవు. "అన్నాను. అలా రాసినదే ఈ "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్". ఈ పుస్తకం పాఠకులకు జీవిత కాలపు నేస్తంగా, ఇంటిల్లిపాదికీ అందమైన జీవితాన్ని అందించగలిగే శ్రేయోభిలాషిలా, ప్రతి ఇంటా మార్గదర్శనం చేస్తుందని నా విశ్వాసం.
- ఎస్ రామారావు
"మనిషి తన మొత్తం జీవిత కాలం ఆనందంగా గడపడం ఎలా సాధ్యమౌతుంది?" అని ఎదో మాటల సందర్భంలో నేను పౌత్రతో అన్నప్పుడు ఆయన "ఏ ఒకటో మనిషి జీవితకాలపు ఆనందానికి సరిపోదు. అన్నీ కావాలి. అన్ని వయసులో అన్నింటా సంతోషంగా ఉండే వ్యక్తి మాత్రమే ఆనందమైన జీవితం గడపగలుగుతాడు." అని చెప్పారు. ఇంకా "బాల్యంలో, కౌమారంలో, యవ్వనంలో, నడివయసులో, వృద్ధాప్యంలో, విద్యార్థిగా, ఉద్యోగిగా, భార్యాభర్తలుగా, స్నేహితులుగా, ప్రేమికులుగా, ఇలా అన్ని దశల్లో అన్ని పాత్రలలోనూ ఒక వ్యక్తి సంతోషంగా జీవించాలనే తపనతో ఉంటే అతడు ప్రవర్తించే విధానమే జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది. ఒక సంపూర్ణ సంతృప్తికర జీవితమే అందమైన జీవితం" అన్నారు. చాలా బాగుంది. ఈ కాన్సెప్టుతో "మీరెందుకు పుస్తకం వ్రాయకూడదు? విజయం వెంట పరుగులెత్తించగల పుస్తకాలు చాలా ఉన్నాయి. కానీ జీవితాన్ని అందంగా మలుచుకోగల పుస్తకాలు లేవు. "అన్నాను. అలా రాసినదే ఈ "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్". ఈ పుస్తకం పాఠకులకు జీవిత కాలపు నేస్తంగా, ఇంటిల్లిపాదికీ అందమైన జీవితాన్ని అందించగలిగే శ్రేయోభిలాషిలా, ప్రతి ఇంటా మార్గదర్శనం చేస్తుందని నా విశ్వాసం. - ఎస్ రామారావు© 2017,www.logili.com All Rights Reserved.