లక్ష్య సాధనలో మన అలవాట్లు చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. సముచితమైన అలవాట్లను సంతరించుకొనడం ద్వారా ఐహిక - ఆముష్మిక జగత్తులు రెండింటిలో ఉన్నత దశలకు మానవుడు ఎదగగలడు. అనేకమందికి ఆధ్యాత్మికంగా ప్రగతి చెందాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ, అధికాంశం ప్రారంభదశలోనే జీవితాంతం స్థంభించి పోయి ముందుకు సాగలేకపోతున్నారు. ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో మానవుడి సాధక - బాధకాలను దృష్టిలో పెట్టుకొని మూర్తిత్రయం - శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీశారదాదేవి, స్వామి వివేకానంద - ఆధ్యాత్మికా మార్గంలో సులభంగా ముందుకు సాగేందుకు అందరికీ అందుబాటులో ఉండే అనేక సరళమైన పద్ధతులను సూచించారు.
రచయిత శ్రీ ఏ.ఆర్.కె. శర్మ ఈ పుస్తకం ద్వారా ఆధునిక తరంవారు చక్కగా ఆకళింపు చేసుకునేందుకు సచిత్ర వర్ణాలతో మూర్తిత్రయం ఉపదేశాలను వివరించారు. ఆధ్యాత్మిక సౌధాన్ని చేరటానికి అంచెలంచెలుగా ఎదగటానికి ఇందులో వివరించిన ఏడు అలవాట్లు వివిధ మెట్లు లాంటివి. ఈ పుస్తకంలో వివరించిన ఏడు అలవాట్లను భక్తులు చక్కగా అలవరచుకొని ఆధ్యాత్మికంగా పురోగమించగలరని ఆశిస్తూ...
-స్వామి జ్ఞానదానంద
లక్ష్య సాధనలో మన అలవాట్లు చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. సముచితమైన అలవాట్లను సంతరించుకొనడం ద్వారా ఐహిక - ఆముష్మిక జగత్తులు రెండింటిలో ఉన్నత దశలకు మానవుడు ఎదగగలడు. అనేకమందికి ఆధ్యాత్మికంగా ప్రగతి చెందాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ, అధికాంశం ప్రారంభదశలోనే జీవితాంతం స్థంభించి పోయి ముందుకు సాగలేకపోతున్నారు. ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో మానవుడి సాధక - బాధకాలను దృష్టిలో పెట్టుకొని మూర్తిత్రయం - శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీశారదాదేవి, స్వామి వివేకానంద - ఆధ్యాత్మికా మార్గంలో సులభంగా ముందుకు సాగేందుకు అందరికీ అందుబాటులో ఉండే అనేక సరళమైన పద్ధతులను సూచించారు. రచయిత శ్రీ ఏ.ఆర్.కె. శర్మ ఈ పుస్తకం ద్వారా ఆధునిక తరంవారు చక్కగా ఆకళింపు చేసుకునేందుకు సచిత్ర వర్ణాలతో మూర్తిత్రయం ఉపదేశాలను వివరించారు. ఆధ్యాత్మిక సౌధాన్ని చేరటానికి అంచెలంచెలుగా ఎదగటానికి ఇందులో వివరించిన ఏడు అలవాట్లు వివిధ మెట్లు లాంటివి. ఈ పుస్తకంలో వివరించిన ఏడు అలవాట్లను భక్తులు చక్కగా అలవరచుకొని ఆధ్యాత్మికంగా పురోగమించగలరని ఆశిస్తూ... -స్వామి జ్ఞానదానంద© 2017,www.logili.com All Rights Reserved.