ఈ సంపుటిలో మొత్తం 12 కథలున్నాయి. ఈ పన్నెండు కథల్లోను వారి జీవితానుభవం నుంచీ ఏర్చి కూర్చిన వస్తువైవిధ్యాలు కనిపిస్తాయి. ఈ దేశంలో ఎవరూలేని అనాథలుంటారు, ఒకరిద్దరున్న అనాథలూ వుంటారు. ఎవరి సహాయ సహకారాలు పొందని అందరూ వున్న అనాథలూ కొందరుంటారు. అలాంటి వారిలో చివరి కోవకు చెందిన అనాథ అమ్మ చీర కథలో రాములయ్య. ఒకవైపు తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలీక, క్రూరుడైన బావవల్ల అక్కకు జరిగిన అవమానం, తన శ్రమను వాడుకోవాలనుకునే సమాజం... దాంతో విరక్తి చెందిన రాములయ్య రైలు పట్టాలమీద, రోడ్డుపైన వెళ్ళే వాహనాల కింద, ఎత్తయిన భవంతుల మీదనుంచీ పడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. చివరకి తన పాత గుడిసెలోనే చనిపోయిన తల్లి కట్టుకునే పాత చీరను, అటక కొయ్యకు తగిలించి ఆత్మహత్యకు పాల్పడితే ఆ చీర తెగిపోయి ఆ ప్రయత్నాన్ని ఆపేస్తుంది. ఇది అమ్మచీర కథలోని సారాంశం.
- వేంపల్లి సికిందర్
ఈ సంపుటిలో మొత్తం 12 కథలున్నాయి. ఈ పన్నెండు కథల్లోను వారి జీవితానుభవం నుంచీ ఏర్చి కూర్చిన వస్తువైవిధ్యాలు కనిపిస్తాయి. ఈ దేశంలో ఎవరూలేని అనాథలుంటారు, ఒకరిద్దరున్న అనాథలూ వుంటారు. ఎవరి సహాయ సహకారాలు పొందని అందరూ వున్న అనాథలూ కొందరుంటారు. అలాంటి వారిలో చివరి కోవకు చెందిన అనాథ అమ్మ చీర కథలో రాములయ్య. ఒకవైపు తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలీక, క్రూరుడైన బావవల్ల అక్కకు జరిగిన అవమానం, తన శ్రమను వాడుకోవాలనుకునే సమాజం... దాంతో విరక్తి చెందిన రాములయ్య రైలు పట్టాలమీద, రోడ్డుపైన వెళ్ళే వాహనాల కింద, ఎత్తయిన భవంతుల మీదనుంచీ పడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. చివరకి తన పాత గుడిసెలోనే చనిపోయిన తల్లి కట్టుకునే పాత చీరను, అటక కొయ్యకు తగిలించి ఆత్మహత్యకు పాల్పడితే ఆ చీర తెగిపోయి ఆ ప్రయత్నాన్ని ఆపేస్తుంది. ఇది అమ్మచీర కథలోని సారాంశం. - వేంపల్లి సికిందర్
© 2017,www.logili.com All Rights Reserved.