కాల్పనిక సాహిత్యం స్థూలంగా మనుషుల మీద, మనుషుల మధ్య సంబంధాల మీద, ఆ సంబంధాల మార్పుల మీద, ఆ సంబంధాల వల్ల కలిగే ఉద్వేగాల మీద ఆధారపడుతుంది. అందువల్ల మనుషులు ఏయే అనుభవాలకు లోనయ్యారో తెలుసుకోవడం, ఆయా అనుభవాలు కాల్పనిక సాహిత్యంలోకి ప్రవహించాయా లేదా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 2009 లో తెలుగు సమాజం అనుభవించిన ఆనంద విషాదాలు అసంఖ్యాకంగా ఉండి ఉంటాయి. వాటిలో కొన్ని అంతకు చాల ముందు నుంచి సాగుతున్నవి కావచ్చు. శతాబ్దాలుగానో, దశాబ్దాలుగానో సాగుతూ సాంస్కృతిక చిహ్నాలుగానో, సామాజిక రుగ్మతలుగానో బలపడిపోయిన అంశాలు కావచ్చు.
వర్తమానం మీద అసంతృప్తి వల్ల ఆ సాంస్కృతిక చిహ్నానికి నిన్నటివరకూ లేని గౌరవం, ప్రాచుర్యం వచ్చి ఉండవచ్చు. ఆ సామాజిక రుగ్మతల చిహ్నాలు కొన్ని హఠాత్తుగా 2009లో బయటపడి ఉండవచ్చు. లేదా 2009లోనే తెలుగు సమాజం కొత్తగా ఆ ఆనందాన్నో, విషాదాన్నో అనుభవించి ఉండవచ్చు. లేదా అంతకముందు నుంచీ తెలిసిన సామాజిక వ్యవహారమే ఈ సంవత్సరం ప్రాధాన్యత సంతరించుకుని ఉండవచు. ఎన్నాళ్ళనుంచో నలుగుతున్నదే అయినా కథగా మలచాలని రచయితకు ఇప్పుడే అనిపించి ఉండవచ్చు.
కాల్పనిక సాహిత్యం స్థూలంగా మనుషుల మీద, మనుషుల మధ్య సంబంధాల మీద, ఆ సంబంధాల మార్పుల మీద, ఆ సంబంధాల వల్ల కలిగే ఉద్వేగాల మీద ఆధారపడుతుంది. అందువల్ల మనుషులు ఏయే అనుభవాలకు లోనయ్యారో తెలుసుకోవడం, ఆయా అనుభవాలు కాల్పనిక సాహిత్యంలోకి ప్రవహించాయా లేదా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 2009 లో తెలుగు సమాజం అనుభవించిన ఆనంద విషాదాలు అసంఖ్యాకంగా ఉండి ఉంటాయి. వాటిలో కొన్ని అంతకు చాల ముందు నుంచి సాగుతున్నవి కావచ్చు. శతాబ్దాలుగానో, దశాబ్దాలుగానో సాగుతూ సాంస్కృతిక చిహ్నాలుగానో, సామాజిక రుగ్మతలుగానో బలపడిపోయిన అంశాలు కావచ్చు. వర్తమానం మీద అసంతృప్తి వల్ల ఆ సాంస్కృతిక చిహ్నానికి నిన్నటివరకూ లేని గౌరవం, ప్రాచుర్యం వచ్చి ఉండవచ్చు. ఆ సామాజిక రుగ్మతల చిహ్నాలు కొన్ని హఠాత్తుగా 2009లో బయటపడి ఉండవచ్చు. లేదా 2009లోనే తెలుగు సమాజం కొత్తగా ఆ ఆనందాన్నో, విషాదాన్నో అనుభవించి ఉండవచ్చు. లేదా అంతకముందు నుంచీ తెలిసిన సామాజిక వ్యవహారమే ఈ సంవత్సరం ప్రాధాన్యత సంతరించుకుని ఉండవచు. ఎన్నాళ్ళనుంచో నలుగుతున్నదే అయినా కథగా మలచాలని రచయితకు ఇప్పుడే అనిపించి ఉండవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.