సర్వేపల్లి రాధాకృష్ణన్ బహుముఖ ప్రజ్ఞావంతుడు. విభిన్నరంగాలలో ఆయన సాధించినవి అనేకం ఉన్నాయి. భారతదేశానికి అనేక విధాలైన సేవలు చేశారు. మానవాళి మధ్య సమన్వయ సాధనకు అట్టడుగు స్థాయినుండి ఎనలేని కృషి సాగించారు. ఆయన గురించి అన్నిటికి మించి ఎన్నదగినది ఆయన అగ్రశ్రేణి తాత్వికవేత్త కావటం. కనుక ఆయన గురించి తుదిరూపంలో ఒక అంచనాకు రావాలంటే చేయవలసింది ఆయన తాత్విక రచనలను పరిశీలించటమే. రాధాకృష్ణన్ తన జీవితంలో మేధాపరంగా, రాజకీయంగా కూడా సమున్నత శిఖరాలకు ఎదిగారు. ఆక్సఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా, మాస్కోలో భారత రాయబారిగా పనిచేసిన తర్వాత రాధాకృష్ణన్ దేశ ప్రథమ ఉపరాష్ట్రపతిగా, తదనంతరం రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. హిందూ తాత్త్వికతని నిర్వచించిన వారిలో 20వ శతాబ్దంలో తానే అత్యుత్తముడన్న గుర్తింపు, ప్రశంస పొందారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ బహుముఖ ప్రజ్ఞావంతుడు. విభిన్నరంగాలలో ఆయన సాధించినవి అనేకం ఉన్నాయి. భారతదేశానికి అనేక విధాలైన సేవలు చేశారు. మానవాళి మధ్య సమన్వయ సాధనకు అట్టడుగు స్థాయినుండి ఎనలేని కృషి సాగించారు. ఆయన గురించి అన్నిటికి మించి ఎన్నదగినది ఆయన అగ్రశ్రేణి తాత్వికవేత్త కావటం. కనుక ఆయన గురించి తుదిరూపంలో ఒక అంచనాకు రావాలంటే చేయవలసింది ఆయన తాత్విక రచనలను పరిశీలించటమే. రాధాకృష్ణన్ తన జీవితంలో మేధాపరంగా, రాజకీయంగా కూడా సమున్నత శిఖరాలకు ఎదిగారు. ఆక్సఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా, మాస్కోలో భారత రాయబారిగా పనిచేసిన తర్వాత రాధాకృష్ణన్ దేశ ప్రథమ ఉపరాష్ట్రపతిగా, తదనంతరం రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. హిందూ తాత్త్వికతని నిర్వచించిన వారిలో 20వ శతాబ్దంలో తానే అత్యుత్తముడన్న గుర్తింపు, ప్రశంస పొందారు.© 2017,www.logili.com All Rights Reserved.